Salmankhan : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ “సికందర్”. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు.

ముంబయిలో జరిగిన ముహూర్తపు షాట్‌తో సికందర్ యాక్షన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్రబృందం కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. “యాక్షన్, థ్రిల్లర్‌తో పాటు భావోద్వేగాలకు కూడా ఈ చిత్రంలో చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించేలా ఉంటాయి. మనం ప్రేమించే వారి కోసం ఏ మేరకు త్యాగాలు చేయగలమనేది ఈ చిత్రం యొక్క కథాంశం” అని చిత్రబృందం తెలిపింది. “సికందర్” సినిమా వచ్చే ఏడాది ఈద్ పండుగ సందర్భంగా విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!