Salmankhan :  సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన యాక్షన్ డ్రామా చిత్రం ‘సికందర్’ షూటింగ్ ప్రారంభమైంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, 2025 ఈద్‌ సందర్భంగా విడుదల కానుంది. తాజాగా సల్మాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా షూటింగ్ ప్రారంభం అయినట్లు తెలియజేశారు. సెట్ లో దిగిన ఫోటోను కూడా పంచుకున్నారు.

ఈ ఫోటోలో సల్మాన్ ఖాన్ కొత్త లుక్ ఆకట్టుకుంటోంది. ‘కిక్’ తర్వాత సల్మాన్ ఖాన్, సాజిద్ నడియాడ్‌వాలా కలయికలో వస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ఈ చిత్రం అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుందని చిత్రబృందం నమ్ముతోంది. ‘సికందర్’ సినిమాలో ఇంకా .. నాసర్‌, శత్రుఘన్‌ సిన్హా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!