Salman Khan : బాలీవుడ్‌ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన “సికందర్” సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. మేలోనే ప్రారంభం కావాల్సిన ఈ చిత్ర షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్నాయి.

ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండనుంది. జూన్ 20న మొదలయ్యే మొదటి షెడ్యూల్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారు. సల్మాన్ ఖాన్ ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను స్వయంగా చేయడానికి ఆసక్తి చూపుతున్నారని, దీని కోసం ఇప్పటికే ఆయన కసరత్తులు కూడా ప్రారంభించారని చిత్రవర్గాలు తెలిపాయి. సాజిద్‌ నడియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఈద్‌ సందర్భంగా విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!