Salaar : టాలీవుడ్ లో యంగ్ టైగర్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్టయిందో తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇటీవల జపాన్ లోనూ రిలీజ్ అయ్యి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించింది. మొదటి వారాంతంలోనే ఈ చిత్రం 18.2 మిలియన్ యెన్ ల భారీ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

ఈ మొత్తం తో సలార్, జపాన్ లో మొదటి వారాంతంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా నిలిచింది. ఆర్ఆర్ఆర్ చిత్రం 44 మిలియన్ యెన్ లతో మొదటి స్థానంలో, సాహో 23 మిలియన్ యెన్ లతో రెండో స్థానంలో ఉన్నాయి. సలార్ సూపర్ సక్సెస్  ప్రభాస్ పాన్-వరల్డ్ స్టార్ డమ్ కు మరో నిదర్శనంగా నిలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటించగా, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Leave a comment

error: Content is protected !!