సలార్‌తో సూపర్ హిట్ కొట్టిన రెబల్ స్టార్ ప్రభాస్, ఇప్పుడు కల్కి 2898 AD తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సైన్స్ ఫిక్షన్ షూటింగ్ పూర్తయింది, అయితే ప్రభాస్ సుదీర్ఘ విరామం తీసుకోనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మీడియాలో ఒక కథనం ప్రకారం.. ప్రభాస్ మే నెలాఖరులో సలార్ 2 షూటింగ్ ప్రారంభించనున్నాడు.

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో సలార్ 2 చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం అందుతోంది. మొదటి షెడ్యూల్ 10 రోజుల పాటు జరగనుంది. ఇందులో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటారు. మొదటి భాగానికి ప్రేక్షకుల నుండి వచ్చిన విపరీతమైన స్పందనను పరిగణనలోకి తీసుకుని ప్రశాంత్ నీల్ మరియు బృందం స్క్రిప్ట్‌లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు.

2025 డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. సలార్ రెండో భాగం శౌర్యాంగ పర్వం లోని భారీ కాస్టింగ్ అభిమానుల్ని అలరించబోతోంది. ఈ భారీ ఎంటర్‌టైనర్‌ను హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Leave a comment

error: Content is protected !!