Sharva 37 : యంగ్ హీరో శర్వానంద్ తన 37వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన నటించే హీరోయిన్ ఎవరో ఇప్పటివరకు తెలియదు. తాజాగా మేకర్స్ ఆమె పేరును, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నది యంగ్ హీరోయిన్ సాక్షి వైద్య. ఇందులో ఆమె పేరు నిత్య.  “ఏజెంట్” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సాక్షి, ఇప్పటివరకు “గాండీవధారి అర్జున” చిత్రంలో నటించింది. ఈమె మలయాళ చిత్రంలోనూ నటించే అవకాశం దక్కించుకుంది.

“మనమే” చిత్రం తర్వాత శర్వానంద్ ఎంచుకున్న ఈ చిత్రంపై అందరి దృష్టి నెలకొంది. రామ్ అబ్బరాజు దర్శకత్వం, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వంటి భారీ బ్యానర్లు ఈ చిత్రానికి మరింత క్రేజ్ తెచ్చాయి. ఇప్పుడు హీరోయిన్ గా సాక్షి వైద్య ఎంపికతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.

మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో సాక్షి వైద్య చాలా అందంగా కనిపించింది. డీసెంట్ లుక్ తో ఆమె ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఆమె ఎలాంటి పాత్రలో నటిస్తుందో, ఎలాంటి నటనను కనబరుస్తుందో చూడాలి. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

Leave a comment

error: Content is protected !!