మణిరత్నం కెరీర్ లో అద్భుతమైన ప్రేమ కథా చిత్రం సఖి. మాధవన్ , షాలినీ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్టయింది. తమిళంలో అలై పాయుదే గా తెరకెక్కిన సినిమాకిది డబ్బింగ్ వెర్షన్.  డాక్టరైన షాలినీని తొలి చూపులోనే ప్రేమిస్తాడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మాధవన్. ఆమె వెంట పడతాడు. ఆమె ముందు ఇష్టపడదు. కానీ ఆ తర్వాత అతడి సిన్సియారిటీకి ఫ్లాటై అతడ్ని ఇష్టపడుతుంది. షాలినీ తండ్రి మాధవన్ ను అవమానిస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకొని ఎవరింట్లో వారుంటారు. కొద్దిరోజులకు నిజం బైటపడుతుంది. షాలిని కుటుంబ సభ్యులు , మాధవన్ కుటుంబ సభ్యులతో గొడవపడతారు. చివరికి ఆ దంపతులిద్దరూ పెద్దలను ఎలా కన్విన్స్ చేస్తారు అన్నదే మిగిలిన కథ.

2000, ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా తమిళం, తెలుగులో కూడా ఘన విజయం సాధించి.. మాధవన్ ను  రొమాంటిక్ హీరో గా పెద్ద స్థానంలో నిలబెట్టింది ఈ సినిమా. ఏఆర్ రహమాన్ సంగీత సారధ్యంలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి. మరి ఇలాంటి రొమాంటిక్ మూవీకి ఛాయగ్రహకుడిగా పీ.సీ శ్రీరామ్ పనిచేయడం వల్ల . .. ఈ సినిమా విజవల్స్ సినిమాను మరో మెట్టులో నిలిపాయి.

Leave a comment

error: Content is protected !!