యంగ్ డైనమైట్ రానా హీరోగా..  వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రివల్యూషనరీ థ్రిల్లర్ ‘విరాటపర్వం’. 1992లో జరిగిన కొన్ని సంఘటనలతో అజ్నాతవాసంలోకి వెళ్ళిపోతారు కొందరు మావో యిస్టులు. ఆ టైమ్ లో వారిలో కలిగిన మానసిక పరివర్తన .. ఆ క్రమంలో జరిగిన కొన్ని అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో ‘విరాట పర్వం’ చిత్రం తెరకెక్కుతోంది. నక్సల్ నాయకుడిగా రానా దగ్గుబాటి నటిస్తూండగా.. కథానాయకి గా సాయిపల్లవి అభినయిస్తోంది. ప్రియామణి, నందితాదాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

నిజానికి ఈ పాటికి ఎప్పుడో విడుదల కావాల్సిన ‘విరాటపర్వం’ చిత్రం  లాక్ డౌన్ కారణంగా .. విడుదల వాయిదా వేసుకుంది. నేడు సాయిపల్లవి పుట్టిన రోజును పురస్కరించుకొని సాయిపల్లవి లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఒక బ్యాగ్ తో కూర్చున్న సాయిపల్లవి లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్ అనే కేప్షన్ తో రివీలైన ఫస్ట్ లుక్ .. సాయిపల్లవి పాత్రను బాగా ఎలివేట్ చేస్తోంది. సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వరా సినిమాస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతోన్న ‘విరాట పర్వం’ చిత్రం హీరోగా రానాకు, హీరోయిన్ గా సాయిపల్లవికి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!