చూపుల్లో చురుకు… కళ్ళల్లో మెరుపు..  అందం, అభినయం,  చిలిపితనం .. కలగలిసిన  కొంటెతనం. అద్దంలాంటి చెక్కిలి.. ముద్దొచ్చే మోము. దానికి ఎప్పుడూ అలంకారంగా ఉండే చిరునవ్వు.  ఆ సుందరి సాయిపల్లవి. ది గాళ్ నెక్స్ట్ డోర్ అనిపించే రూపం. దానికి తోడు   నాట్యంలో ప్రావీణ్యం..  ఈ తమిళ ముద్దుగుమ్మ మళయాళం ‘ప్రేమమ్’తో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ సినిమా చూసిన తెలుగువారికి అరె ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే అనిపించింది. తెలుగునాట డాన్స్ కాంపిటీషన్ ప్రోగ్రామ్ ‘ఢీ’లో ఒకప్పుడు రన్నర్‌గా నిలచింది సాయిపల్లవి. ఆ తరువాత నటిగా తెరపై తళుక్కుమంది. ఆ తర్వాత దిల్ రాజు  ‘ఫిదా’ చిత్రంలో భానుమతి పాత్రతో  తెలుగు వారికి బాగా దగ్గరైంది సాయిపల్లవి .

‘ఫిదా’ చిత్రంతో నిజంగానే తెలుగు యువకులను ఫిదా చేసేసింది సాయిపల్లవి. ఆ చిత్రంతోనే వరుణ్ తేజ్ తన తొలి హిట్‌ను అందుకోవడం విశేషం. ఈ ఒక్క చిత్రంతోనే సాయిపల్లవి తెలుగువారికి చేరువయింది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన దిల్ రాజు తన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’లోనూ సాయిపల్లవికి అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం సైతం సాయిపల్లవికి అరుదైన విజయాన్ని అందించింది. ఈ రెండు చిత్రాల విజయంతో సక్సెస్ రూటులో సాగిపోయింది సాయిపల్లవి.  ఇటు తెలుగులోనూ , అటు తమిళంలోనూ తనదైన శైలిలో తన ప్రతిభను చాటుకుంటోన్న సాయిపల్లవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే సాయిపల్లవి

Leave a comment

error: Content is protected !!