ప్రముఖ చిల్డ్రన్స్ డాక్టర్ జ్యోతిర్మయి డైలాగ్‌కింగ్ సాయికుమార్ కూతురని అందరికి తెలిసిందే. గతేడాది ఇదేరోజున కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్‌లో చెరిష్ చిల్డ్రన్స్ క్లినిక్ అనే హాస్పిటల్‌ను ఆమె ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఎక్విప్‌మెంట్‌తో హాస్పిటల్‌ను ప్రారంభించిన ఆమె ఒక్క ఏడాదిలోనే మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంది. కొండాపూర్ ఏరియాలో ఉండే పిల్లలందరికి ఏ చిన్న సమస్య వచ్చిన జ్యోతిర్మయి ఉంది అనే భరోసాను చిన్నపిల్లల తల్లితండ్రులకిస్తున్నారామె. ఆమె తమ పిల్లలకు అందిస్తున్న వైద్యం గురించి ఎంతోమంది తల్లితండ్రులు జ్యోతిర్మయిని అభినందిస్తూ వారి అభిప్రాయాలను వీడియోల రూపంలో షేర్‌చేశారు. చెరిష్ క్లినిక్ యానివర్సరీని పురస్కరించుకుని జ్యోతిర్మయి మాట్లాడుతూ–‘‘ నా చెరిష్ క్లీనిక్‌ను ప్రారంభించి ఈ ఏడదిలో దాదాపు 2500మంది పిల్లలను ట్రీట్ చేశాను. పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పేరెంట్స్‌కి ముందుజాగ్రత్తలు ఎలా తీసుకోవాలో ఎడ్యుకేట్ చేస్తాను. పిల్లలను ఆసుపత్రుల చుట్టూ తిప్పకుండా ఇంట్లోనే ట్రీట్‌మెంట్ ఎలాచేయాలి? అని హోమ్ రెమెడీస్ చెప్తాను. నా దగ్గరకు వచ్చే పిల్లలకు ఇది హాస్పిటల్ అనే ఫీలే లేకుండా మా క్లినిక్‌ను డిజైన్ చేశాను. పిల్లలకు ఇన్‌ఫెక్షన్స్ వెంటనే అంటుకుంటాయి. అందుకే పిల్లలకి ఎటువంటి ఇన్‌ఫెక్షన్స్ సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటాను. అన్నిరకాల అంతర్జాతీయ ప్రమాణాలను నా క్లినిక్‌లో పాటిస్తున్నాను. నాతో పాటే నా స్టాఫ్‌కి, నాకు ఎప్పుడు మద్దతుగా నిలుస్తున్న నా కుటుంబానికి ట్రీట్‌మెంట్‌కోసం నా దగ్గరకొచ్చే సూపర్‌కిడ్స్ అందరికి నా ముద్దులు’’ అన్నారామె.