సైబర్ నేరాలను ఎంత వరకు అడ్డుకుంటున్న కూడా అవి ఎప్పటికప్పుడు రోజు రోజుకి కొత్త దారులను వెతుకుంటూ అమాయకుల నుండి డబ్బులను కొళ్ళగొడుతూనే ఉన్నాయి. తాజాగా ఫే స్బుక్, వాట్సాప్ వంటి యాప్స్ లలో ఓ నకిలీ ఖాతాను సృష్టించి తామ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాం సహాయం చేయండి అంటూ డబ్బులను దోచేస్తున్నారు.

ఇటువంటి సైబర్ క్రైమ్ పరిస్థితి సాయి ధరమ్ తేజ్ దృష్టికి ఎదురైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తాను సాయి ధమ్ తేజ్ నంటూప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానని సహాయంగా కొంత డబ్బును కోరుతూ  సామాజిక మాధ్యమం ద్వారా కొంతమంది దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేస్తూ సాయిధమ్ తేజ్అటూ అభిమానులను ఇటూ తనతో పరిచయమున్న వాళ్ళని అప్రత్తం చేశాడు. తాను నటించిన కోస్టార్స్ ఎవరో తన పేరు మీద డబ్బులు వసూలు చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చింది. తనకు ఆర్థిక సాయం కావాలని ఆ మెసేజ్ లో వారిని అడుగుతున్నాడు అంటూదీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసిన పోస్ట్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు. ఆ మెసేజ్ తాలూకు వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ను షేర్ చేశాడు తేజ్. మీరంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాటిని ఎవరూ నమ్మద్దు అని పేర్కొంన్నాడు.

 

Leave a comment

error: Content is protected !!