మన దేశం లాక్ డౌన్  పరిస్థితుల్లో చిక్కుకొన్న సంగతి తెలిసిందే. చిన్న, పెద్ద, ముసలి ముతకా అంతా ఎవరి ఇంటి దగ్గరే వారు సేఫ్ గా లాక్ అయ్యారు. అయితే మనుషులు ఎవరూ తిరగని వేళ మూగజీవాలకు తిండి ఎవరు పెడతారు? ముఖ్యంగా వీధి కుక్కలకు, తదితర ప్రాణులకు తిండి పెట్టే నాథుడు ఎవరు? వారి ఆకలి ఎలా తీరుతుంది? సరిగ్గా ఇలాగే ఆలోచించి..   ప్రముఖ సంగీత దర్శకుడు  దేవీ ప్రసాద్ తమ్ముడు , గాయకుడు సాగర్ ..  ఆ మూగజీవాలను ఆదుకొనేందుకు ముందుకొచ్చాడు.

ఆకలిది యూనివర్సల్ లాంగ్వేజ్ . అందుకే ఈ మూగజీవాలకు మనమే గొంతు అవుదాం. ఈ లాక్ డౌన్ టైమ్ లో వాటికి తిండి పెట్టి వాటి ఆకలిని తీర్చడం నాకు చాలా సంతృప్తిగా ఉందంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా నా భార్యకు థాంక్స్ చెబుతున్నానని కూడా చెప్పాడు. సాగర్ చేసిన మంచి పనిని అన్న దేవీశ్రీ ప్రసాద్ అభినందిస్తూ..  రీట్వీట్ చేశాడు.

 

Leave a comment

error: Content is protected !!