‘ వాన‌విల్లు ‘మూవీ తో ఎంట్రీ ఇచ్చిన మల్టీటాలెంటెడ్ ప్రతీక్ ప్రేమ్ క‌ర‌ణ్. తమిళ్ హీరో విజయ్ స్టైల్లో కనిపించే ఈ హీరో లేటేస్ట్ మూవీ ‘ సదా నన్ను నడిపే ‘. వైష్ణవి పట్వర్ధన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో నాగేంద్ర బాబు, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి చిత్ర హీరోనే ద‌ర్శ‌క‌త్వం, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్ అందించడం విశేషం. నేడే ఈ సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించిందా లేదా అనేది ఈ రివ్యూ లో చూద్దాం.
కథ:
MJ అలియాస్ మైఖేల్ జాక్సన్ (ప్రతీక్ ప్రేమ్ కరణ్) సరదాగా స్నేహితులతో గడిపే కుర్రాడు. అతడు సాహా(వైష్ణవి పట్వర్దన్) ప్రేమలో పడతాడు. ఆమె ఎంత కాదన్నా ఎంతో సిన్సియర్ గా లవ్ చేస్తూ వుంటాడు. సాహా తండ్రి రాజీవ్ కనకాల కూడా MJ ప్రేమని అంగీకరించడు. అయితే MJ మాత్రం ఎలాగైనా సాహా ప్రేమని పొందాలని పరితపిస్తూ వుంటాడు. ఈ కార్యక్రమంలో MJ ప్రేమని…. సాహా అంగీకరించి వివాహం చేసుకుంటుంది. అయితే పెళ్ళైన మొదటి రోజు నుంచే MJ ని దూరం పెడుతూ ఉంటుంది. పెళ్లి చేసుకుని కూడా సాహా… MJ ని ఎందుకు దూరం పెడుతూ ఉంటుంది? ఆమె సమస్య ఏంటి? హీరో దాన్ని ఎలా పరిష్కరించాడు? వీరిద్దరూ చివరకి కలుసుకున్నారా? లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…!!!

కథ… కథనం విశ్లేషణ:

గీతాంజలి, కలిసుందాం రా చిత్రాల లాగే ఉంటుందని ఓ ప్రెస్ మీట్ లో చిత్ర హీరో మరియు డైరెక్టర్ ప్రతీక్ ప్రేమ్ కరణ్ చెప్పినట్టు గానే ఈ సినిమాని రూపొందిచారనే చెప్పాలి. క‌ర్ణాటక లో జ‌రిగిన ఓ వాస్తవ సంఘటన తీసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. ఐతే కొంచెం సినిమాటిక్ గా మార్చి తీయడం జరిగింది.కావాల్సిన వ్య‌క్తి చ‌నిపోతున్నారని తెలిశాక వారితో వున్న కొద్దిక్ష‌ణాలను ఓ జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటామో అనేది ఈ సినిమా లో చూపించారు.రియల్ స్టోరీ లోని ఫీల్ ని ఎమోషన్ ని డైరెక్టర్ పర్పెక్ట్ గా ప్రజెంట్ చేయడం లో సక్సెస్ అయ్యారు.ప్రేమించిన వ్యక్తికోసం ఎలాంటి త్యాగాన్ని ఆయినా చెయ్యొచ్చు అని… ఇందులో ఎంతో ఎమోష‌నల్ గా తెరకెక్కించారు. కొన్ని సన్నివేషాల్లో ఎమోషన్ కి ప్రేక్షకులు ఫిదా అవ్వక మానరు.

హీరో కమ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రేమ్ చాలా బాగా చేశాడు. తను నటిస్తూనే.. దర్శకత్వ బాధ్యలను చాలా సమర్థవంతంగా నిర్వహించాడు. హీరోయిన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. అలీ వున్నంత సేపు బాగా నవ్వులు పుయించాడు. నాగబాబు, రాజీవ్ కనకాల తమ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. సంగీతం బాగుంది. నందు కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి. విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్‌, కొడైకెనాల్‌, కులుమ‌నాలిలో చిత్రీకరించిన లోకేషన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేసుంటే బాగుండేది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3/5
బాటమ్ లైన్ : ఎమోషనల్ గా సాగే ” సదా నన్ను నడిపే”

Leave a comment

error: Content is protected !!