QG Movie : వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వం వహించి, తమిళ నిర్మాతలు నిర్మించిన ‘క్యూ జి’ అనే సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో జాకీ షరాఫ్, సన్నీలియోన్, ప్రియమణి, సారా అర్జున్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంలో ఎంతో హై కాంపిటీషన్ ఉన్నప్పటికీ, తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్‌ను రుషికేశ్వర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎం. వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు.

వేణుగోపాల్ మాట్లాడుతూ, తమిళ నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా టీజర్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోందని తెలిపారు. జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. అతి త్వరలోనే ఈ సినిమాను మూడు సంస్థల ద్వారా తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

తెలుగు ప్రేక్షకులు కంటెంట్‌ కు మంచి విలువ ఇస్తారని, చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా మంచి సినిమాలకు విజయం అందిస్తారని వేణుగోపాల్ నమ్మకం వ్యక్తం చేశారు. ‘క్యూ జి’ సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొంది పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!