రూల్స్ రంజన్ సెప్టెంబర్ 28 న రాబోతున్నాడు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా మీడియా ప్రెస్‌మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా , రత్నం కృష్ణ డైరెక్షన్‌లో స్టార్‌లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న రూల్స్ రంజన్ మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించారు. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, సుబ్బరాజు, అజయ్, గోపరాజు రమణ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నూ కపూర్, సిద్ధార్థ్ సేన్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్ మరియు గుల్షన్ పాండే సహా హిందీ నటులు కూడా నటిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం ఇస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో చిత్ర యూనిట్ పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేసారు.