RT 75 : ప్రస్తుతం డైనమిక్ ఫిల్మ్ మేకర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ అనే చిత్రంలో నటిస్తున్న మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ గా తన ప్రతిష్ఠాత్మకమైన 75వ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతూ.. సినిమా పై ఉన్న అంచనాలను మరింత పెంచారు.

గతంలో ధమాకాలో రవితేజతో స్క్రీన్‌ను పంచుకున్న శ్రీలీల మరోసారి కథానాయికగా నటించబోతుండడం విశేషం. RT 75 గా పిలుచుకుంటున్న ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతోంది. రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. బీమ్స్ సిసిరిలియో సంగీతం అందిస్తున్నాడు.

Leave a comment

error: Content is protected !!