కరోనా వైరస్ ప్రపంచ దేశాల్ని కకావికలం చేసింది. ముఖ్యంగా మనదేశంలో లాక్ డౌన్ కారణంగా ఈ రెండు నెలల్లోనూ అన్ని రంగాల్లోనూ విపరీతమైన నష్టం ఏర్పడింది. ప్రత్యేకించి సినీ రంగం అన్ని విధాలుగానూ నష్టపోయింది. సినిమా షూటింగ్స్ లేక, థియేటర్స్ మూతపడి.. వాటిని నమ్ముకొన్న చాలా మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వీరిని ఇంతవరకూ చిరంజీవి ఆధ్వర్యంలోని సిసిసి ఆదుకుంది. అయితే నెలల తరబడి వారికి నిత్యావసరాలు సమకూర్చాలంటే చాలా కష్టమైన పని.. ఇదే విషయాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుని షూటింగ్‌లు, థియేటర్ల రీఓపెన్‌పై ఈ బుధవారం మెగాస్టార్ చిరంజీవి నివాసంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదద్‌తో ఇండస్ట్రీ పెద్దలంతా కీలక సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే.
పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఓకే కానీ షూటింగ్‌ల విషయానికి వస్తే సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం షూటింగ్ ఎలా చేస్తారని మంత్ర చిత్ర వర్గాలని అడిగినట్టు తెలిసింది. దీనికి టెస్ట్ షూట్ చేసి చూపిస్తామని, ఆ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని దర్శకుడు రాజమౌళి మంత్రికి వెల్లడించినట్టు తెలిసింది. భౌతిక దూరాన్ని పాటిస్తూ `ఆర్ఆర్ఆర్` కోసం రాజమౌళి టెస్ట్ షూట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే… ఆయనతో పాటు కొరటాల శివ కూడా ‘ఆచార్య’ సినిమా కోసం టెస్ట్ షూట్ చేయబోతున్నడట. కొరటాల , రాజమౌళి టెస్ట్ షూట్ రిజల్ట్ ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం జూన్ మొదటి వారం నుంచి షూటింగ్‌లకు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.