తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన సినిమాటోగ్రాఫర్లలో ఆర్.రత్నవేలు ఒకరు. భారీసినిమాలకు ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకు తన కెమెరాకన్నుతో ప్రాణం పోసిన బెస్ట్ టెక్నిషియన్ ఆయన. తన టాలెంట్ తో దర్శకుల మనసులనే కాదు సినిమా చూసే సగటు సిని అభిమానులకి విజ్వల్ ట్రీట్ అందించి కొన్ని కోట్ల సినిఅభిమానులతో శభాష్ అనిపించుకున్నాడు. ఆయన ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. సుకుమార్ తో చేసిన జగడం ఆర్య & కుమారి 21ఎఫ్ చిత్ర విజయాలలో తన కెమెరాకు
ప్రత్యేక  స్థానం ఉంటుంది. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సుకుమార్‌ కలయికలో వచ్చ్హిన 1 నేనొక్కడినే తో తెలుగు ప్రేక్షకులకు తన కెమరా పనితనంతో హాలివుడ్ ప్లేవర్ ను అందించాడు. అలాగే వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రి మూవీ ఖైదీ నంబర్ 150 కూడా రత్నవేలు సినిమాటోగ్రఫి అందించారు. ఇటివల ఆయన చేసిన రంగస్థలం, సైరా సినిమాలు విజ్వల్ వండర్ మూవీస్ గా తెరకెక్కి భారి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆయనకు దర్శకత్వం చేయాలనే కోరిక ఉన్నట్లు ఇటివల ఓ ఇంటర్వ్యూలో తెలియచేశారు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యుల్ వల్ల కుదరట్లేదని చెప్పారు. ప్రస్తుతం ఆయన శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు 2 సినిమా చేస్తున్నారు. ఇంకా మరెన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకి తన కెమెరాతో విజ్వాల్ ట్రీట్ అందించాలని కోరుకుంటు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది మూవీ వాల్యూం.

Leave a comment

error: Content is protected !!