చూపు తిప్పుకోలేని అందం.. మత్తెక్కించే కళ్ళు.. మైకం కమ్ముకొచ్చే చూపులు… ఒంపులు తిరిగిన వయ్యారాలు.. దాసోహం అనిపించే సోయగాలు.. ఆ రత్తాలును  చూస్తే నిలబడ నంటాయ్ కుర్రకారు చొక్కా బొత్తాలు . ఆమె  రాయ్ లక్ష్మి. సౌత్ ఇండస్ట్రీలో ఆమె ఒక అందాల సునామీ. ఆమె సంధించే ఎరోటిక్ ఏరోలు…సూటిగా తాకి చిత్తైపోనివాడే ఉండడంటే అతిశయోక్తిలేదు.

‘కాంచనమాల కేబుల్‌ టీవీ’ చిత్రంతో తెలుగులో తొలిసారిగా నటించింది రాయ్‌లక్ష్మి. ఆ తరువాత కూడా తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది. వాటిలో బాలకృష్ణతో కలిసి ‘అధినాయకుడు’లో కథానాయికగా నటించింది. రవితేజ నటించిన ‘బలుపు’తో పాటు పవన్‌ కల్యాణ్‌ ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’లోనూ, మెగాస్టార్ ‘ఖైదీ నంబర్ 150’ చిత్రాల్లోని  ప్రత్యేక గీతాల్లో ఆడిపాడి తన సత్తా చాటింది. తెలుగులో ‘ఆనందభైరవి’లో అంజలితో కలిసి నటిస్తోంది. ఇంకా కన్నడ, తమిళంలోనూ కొన్ని సినిమాల్లోను నటిస్తుంది. ప్రస్తుతం ‘మృగ’ అనే చిత్రంలో చేస్తుంది. ఈ సినిమా తెలుగులో ‘గర్జన’గా వస్తుంది. రాయ్‌లక్ష్మి సామాజిక మాధ్యమాల్లో ఉంటూ హాట్‌హాట్‌ ఫోటోలతో మత్తెక్కిస్తుంది. నేడు   రాయ్‌లక్ష్మి పుట్టినరోజు.  ఈ సందర్భంగా ఆ అందాల రత్తాలుకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే రాయ్ లక్ష్మి

Leave a comment

error: Content is protected !!