‘అల వైకుంఠపురములో’ చిత్రం బ్లాక్ బస్టర్ తర్వాత.. బన్నీ నటిస్తోన్న ‘పుష్ప’ సినిమాపై అంతకంతకూ అంచనాలు రెట్టింపవుతున్నాయి. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పాన్ ఇండియా కేటగిరిలో విడుదల కానుండడం విశేషం. అందుకే దీనిపై వచ్చే ప్రతీ అప్డేట్ పైనా ఎంతగానో ఆసక్తి నెలకొంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో .. లారీ డ్రైవర్ గా నటించనున్న బన్నీ.. ఆ పాత్రకు తగ్గట్టుగానే తన మేకోవర్ ను పూర్తి గా మార్చుకున్నాడు. ఇక ఈ సినిమాలో విలన్ గా ఫైర్ బ్రాండ్ రోజాను సంప్రదించినట్టుగా వార్తలొస్తున్నాయి.

గతంలో ‘శంభో శివశంభో , మొగుడు’ చిత్రాల్లో నెగెటిల్ రోల్ చేసిన రోజా.. ‘పుష్ప’ చిత్రంలో ఒక పపర్ ఫుల్ పాత్ర పోషించనున్నట్టు సమాచారం. మైత్రీ మూవీస్ బ్యానర్ లో నిర్మితమవుతోన్న ఈ సినిమాకు రోజా ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణ కానుందని చెప్పుకుంటున్నారు. అదే కానీ జరిగితే.. ‘పుష్ప’ చిత్రం మరింతగా వార్తల్లో నిలవడం ఖాయం . మరి ఇందులో నిజంగానే రోజా నటిస్తుందో లేదో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.

 

Leave a comment

error: Content is protected !!