Rocky meets Deva : కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ప్రస్తుతం తన కెరీర్‌లో 131వ చిత్రం తో బిజీగా ఉన్నారు. కార్తిక్ అద్వైత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సామ్ సి.ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సెట్స్‌లోకి అనూహ్యంగా కన్నడ రాకీ స్టార్ యష్ అడుగు పెట్టడంతో సోషల్ మీడియా వేడెక్కింది.

మేకర్స్ ఈ ఇద్దరు స్టార్ హీరోలను కలిపి తీసిన ఫోటోలు, వీడియోలను ‘రాకీ మీట్స్ దేవ’ అనే క్యాప్షన్‌తో విడుదల చేయడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. భువనేశ్వరి పిక్చర్స్, పద్మజ ఫిల్మ్స్ బ్యానర్ల పై నిర్మితవుతున్న ఈ చిత్రానికి ఏ.జే శెట్టి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక యష్ తదుపరి గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’లో నటిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకులు మరియు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Leave a comment

error: Content is protected !!