మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో భారీ అంచనాలున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ రిలీజ్ డేట్ సమీపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా, రవితేజ పుట్టినరోజు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్ రాకింగ్ నంబర్ ‘ఈగల్స్ ఆన్ హిస్ వే’ ను విడుదల చేశారు.

దావ్‌జాంద్ స్కోర్ చేసిన పాట రవితేజ పోషించిన సహదేవ్ అకా ఈగల్ పాత్ర యొక్క వైల్డ్ నేచర్ ని తెలియజేస్తుంది. ఈ ఎలక్ట్రిఫైయింగ్ ట్రాక్‌లో ఇంగ్లీష్ లిరిక్స్ రాసిన జార్జినా మాథ్యూ, స్వయంగా వోకల్స్ ని కూడా అందించారు. ఈ థీమ్ నంబర్ ఈగిల్‌కి తగిన ఎలివేషన్‌లను ఇచ్చింది. విజువల్స్ రవితేజ ని కిల్లర్ అవతార్ లో చూపిస్తున్నాయి. ఒరిజినల్ విజువల్స్‌తో సినిమాలో ఈ పాటను చూసినప్పుడు ఇంపాక్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది.

Leave a comment

error: Content is protected !!