ఓ వైపు నటిస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నారు సినీ, టీవీ సీరియల్ ఆర్టిస్ట్స్. సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శ్రీవాణి, విక్రమాదిత్యలు మణికొండలో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసారు. ‘మీ కడుపునిండా‘ పేరుతో అద్భుతమైన నాన్‌వెజ్ ఆంధ్రస్టైల్ వంటకాలతో రెస్టారెంట్ ఓపెన్ చేసారు. నటి, ఆంధ్ర మినిస్టర్ రోజా చేతుల మీదుగా ‘మీ కడుపునిండా‘ రెస్టారెంట్ ప్రారంభోత్సవం జరిగింది. మణికొండ ఏరియాలో సినీ , టీవి ఆర్టిస్టులు ఎంతోమంది ఉంటున్నారు.. వారందరికీ అందుబాటులో ఉండేలా ఈ ‘మీ కడుపునిండా‘ రెస్టారెంట్ ఏర్పాటు చేసామన్నారు. మినిస్టర్ ఆర్‌కే రోజా తనకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ గురించి ఇంట్లో వంట గురించి సరదాగా ముచ్చటిస్తూ.. శ్రీవాణి, విక్రమాదిత్యల ‘మీ కడుపునిండా‘ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.