రిషి కపూర్హం తుం ఏక్ కమరే మే బంద్ హోం ఔర్ చాభి ఖో జాయ్అంటూ తన మొదటి సినిమాబాబీతోనే రొమాంటిక్ హీరోగా  ప్రేక్షకుల్ని ముఖ్యంగా ఫీమేల్ ఆడియన్స్ హృదయంలో ఎప్పటికి చెరిగిపోని  ముద్ర వేశారు. ఈయన బాలీవుడ్  ప్రముఖ నటుడు రాజ్ కపూర్ వారసుడు. వెండి తెరకు తండ్రి రాజ్కపూర్ దర్శకత్వంలో వచ్చిన  మేరా నామ్ జోకర్సినిమాతో బాలనటుడిగా పరిచయం అయ్యారు. తర్వాత హీరోగా కూడా తండ్రి దర్శకత్వం వహించినబాబీసినిమాతో కెరీర్ ప్రారంభించడం విశేషం. సినిమాలో డింపుల్ కపాడియ హీరోయిన్ గా నటించింది. తర్వాత ఎన్నో యూత్ఫుల్, రొమాంటిక్ ప్రేమ కథలతో మెప్పించి తనదైన నటనతో బాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్హీరోగా నిలిచారు. హీరోగా కొనసాగిస్తూ మల్టిస్టారర్ సినిమాల్లోను నటించి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగాను ఎన్నో పాత్రలను పోషించారు. బాలీవుడ్ లో ఆయన వారసుడుగా రణబీర్ కపూర్ రాణిస్తున్నాడు.

రిషి కపూర్  కెరీర్ తొలినాళ్లలో  మైలురాళ్లుగా నిలిచిన సినిమాలుగాబాబీ‘, ‘కభీకభీ‘, ‘కర్జ్‘, ‘ప్రేమ్ రోగ్‘, ‘సాగర్‘, ‘అమర్ అక్బర్ ఆంథోని‘, ‘హమ్ కిసీసే కమ్ నహీలాంటి చిత్రాలను పేర్కొనవచ్చు. అలాగే హీరోగా చివరిదశలో చేసినసర్గమ్‘, ‘చాందినీ‘, ‘బోల్ రాధా భోల్‘, ‘దీవానాసినిమాలను పేర్కొనవచ్చు. టి. సుబ్బిరామిరెడ్డి సమర్పకుడిగా ఆయన నటించినచాందినీసినిమానిశ్రీదేవిపేరుతో తెలుగులోకి అనువాదం చేశారు.

రిషి కపూర్ సినీ ప్రయాణం రెండో దశలో నటుడిగా విశేషంగా రాణిస్తున్న సమయంలో క్యాన్సర్ వ్యాధిన పడ్డారు. అమెరికాలో చిక్సిత పొందడం ద్వారా ఆరోగ్యం కుదుటపడినట్టే కనిపించింది. కానీ అనుకోకుండా గత ఏడాది ఏప్రిల్ 30  లాక్డౌన్ సమయంలో రిషి కపూర్ క్యాన్సర్ తో పోరాడుతూ మరణించారు. రొమాంటిక్ హీరో ప్రథమ వర్ధంతి సందర్బంగా రిషి కపూర్ కు ఘననివాళులు అందిస్తుంది మూవీ వాల్యూం.

Leave a comment

error: Content is protected !!