Vettaiyan : సూపర్ స్టార్ రజనీకాంత్, టి.జే. జ్ఞానవేల్ కాంబినేషన్ లోని భారీ చిత్రం ‘వేట్టైయన్’ భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. ‘జైభీమ్’ లాంటి సందేశాత్మక చిత్రం తర్వాత జ్ఞానవేల్ రజనీని డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు ఎన్నో రెట్లు పెరిగాయి. హైదరాబాద్, తిరువనంతపురం, కన్యాకుమారి, ముంబై, కేరళ ప్రాంతాల్లో టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో తాజాగా భారీ సాంగ్ షూటింగ్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఈ సాంగ్ కోసం 500 మంది డాన్సర్లతో ఎంతో రిచ్ గా చిత్రీకరణ జరిపారు. ఈ సాంగ్ కోసం ఏకంగా 5 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. రజనీకాంత్ కెరీర్ లో ఇంత భారీ తారాగణంతో పాటలు చిత్రీకరించడం కొత్తేమీ కాదు. అయితే ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున డాన్సర్లతో పాటలు చేయలేదు.

లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి దీపావళి కానుకగా అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే రజనీకాంత్ హీరోగా లొకేష్ కనగరాజ్ చిత్రం కూడా పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ‘వెట్టేయన్’ ముగింపు దశకు చేరుకున్న సమయంలోనే లొకేష్ కూలి సినిమాకి డేట్లు కేటాయించారు.

Leave a comment

error: Content is protected !!