Rewind movie trailer : కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందిన ‘రివైండ్’ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సినిమాలో సాయి రోనక్, అమృత చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈ సినిమాలో కళ్యాణ్ చక్రవర్తితో పాటు సాయి రోనక్, అమృత చౌదరి, శివ రామ్ చరణ్, తుషార పాలా వంటి కొత్త వారు నటించారు. సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ జోనర్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకర్షిస్తాయని కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. చిత్రబృందం మంచి బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి కంటెంట్‌ను తయారు చేసిందని సాయి రోనక్ అన్నారు.
చిత్రబృందం మొత్తం ఈ సినిమాపై ఎంతో ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నారు. ఈ సినిమాను ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

కళ్యాణ్ చక్రవర్తి సార్‌ తో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. స్క్రీన్‌ప్లే చాలా బాగుంది. కొత్త టీం అయినా అందరం కష్టపడి పని చేశాం తుషార పాలా అన్నారు. బిగ్ స్క్రీన్ మీద నాకు ఇది ఫస్ట్ సినిమా. స్క్రీన్‌ప్లే చాలా బాగుంది. ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అని అమృత చౌదరి అన్నారు. చిన్న టీం అయినా మంచి లైన్‌తో మంచి స్క్రిప్ట్ తయారుచేసుకొని ఈ సినిమాని చేశాం. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉంటే కచ్చితంగా సినిమాను ఆదరిస్తారు అని సాయి రోనక్ అన్నారు. టైమ్ ట్రావెల్ మీద తీసిన లవ్, సై ఫై జోనర్ మూవీ. ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చింది. మా ఈ టైం ట్రావెల్ మీద తీసిన రివైండ్ మూవీ కూడా ప్రేక్షకులు అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అని దర్శకుడు కళ్యాణ్ చక్రవర్తి అన్నారు.

Leave a comment

error: Content is protected !!