Mr. Bachan movie : “వన్స్‌ మోర్‌ మోర్‌ మోర్‌…” అంటూ మనసుని తాకుతూ, మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా నుంచి ‘రెప్పల్ డప్పుల్’ సాంగ్ విడుదలైంది. మాస్ మహారాజా రవితేజ , భాగ్య శ్రీ బోర్సే కలిసి చేసిన డాన్స్ ఈ పాటకి మరింత హుషారును తెచ్చిపెట్టింది. పూర్తి సాంగ్‌ను తెరపై చూడాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. “బొమ్మ సోకులో బొంబాయి జాతరే… బచ్చన్‌ గొంతులోన బప్పీలహరే… ” అంటూ మొదలయ్యే ఈ చిత్రంలోని ఈ పాటని గురువారం విడుదల చేశారు.

మిక్కీ జె.మేయర్ స్వరకల్పనలోని ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యం సమకూర్చగా, అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. భాను నృత్యాలు సమకూర్చారు. “రెప్పల్ డప్పుల్…” అంటూ ఉత్సాహభరితమైన బీట్‌తో సాగే ఈ పాట మాస్ స్టెప్పులతోనూ, గ్లామర్‌తోనూ అలరిస్తోందని చిత్రవర్గాలు తెలిపాయి.

Leave a comment

error: Content is protected !!