ఒకప్పటి ఫ్యామిలీ స్టార్ జగపతి బాబు నటించిన అద్భుత కుటుంబ కథా చిత్రాల పరంపరలో ‘శివరామరాజు’ ఒకటి. వెంకట్, శివాజీ జగపతి బాబు తమ్ముళ్ళుగానూ, మోనిక చెల్లెలుగానూ నటించిన ఈ సినిమాకి వి. సముద్ర దర్శకుడు. వీరి తండ్రిగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పవర్ ఫుల్ పాత్రలో నందమూరి హరికృష్ణ కనిపిస్తారు. 2002 లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్టైంది.

పూనమ్ సింగార్, లయ, కాంచీ కౌల్, పిరమిడ్ నటరాజన్, ఆనందరాజ్, బ్రహ్మానందం ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. రామిరెడ్డి విలన్ గా నటించారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్బీ చౌదరి ఈ సినిమాను నిర్మించారు.
నిజానికి ఈ సినిమా సముద్రం అనే తమిళ సినిమాకు ఆఫీషియల్ రీమేక్.

శరత్ కుమార్, మురళి, మనోజ్ భారతీరాజా ముఖ్యపాత్రల్లో నటించారు. కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే శివరామరాజు చిత్రంలోని హరికృష్ణ పై చిత్రీకరించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోని సబ్ ప్లాట్ ను మాత్రం శరత్ కుమార్ నటించిన సింహరాశి చిత్రం నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత ఇదే సినిమా కన్నడలో రవిచంద్రన్  హీరోగా పరమశివ గా రీమేక్ అయింది.

Leave a comment

error: Content is protected !!