Remake of the Day : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ యన్టీఆర్ నటించిన సూపర్ హిట్ కుటుంబ కథా చిత్రం ‘రాము’. 1968లో విడుదలైన ఈ సినిమా ఏవీయం ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏసీ త్రిలోక్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కింది. పుష్పలత, దేవిక హీరోయిన్స్ గా నటించారు. యస్వీరంగారావు, రేలంగి, రాజనాల, పద్మనాభం, రమణారెడ్డి తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. రాము టైటిల్ రోల్ కీలక పాత్రలో మాస్టర్ రాజ్ కుమార్ నటించాడు. అప్పట్లో ఈ సినిమా సిల్వర్ జూబిలీ హిట్టయింది.

ఈ సినిమా తమిళంలో 1966లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం ‘రాము’ కు రీమేక్ వెర్షన్ . జెమినీ గణేశన్ హీరోగా నటించిన ఈ సినిమాలో పుష్పలత, కేఆర్ విజయ హీరోయిన్స్ గా నటించారు. నిజానికి ఈ సినిమా దూర్ గగన్ కి చోవ్ మే అనే హిందీ చిత్రం ఆధారంగా తెరకెక్కింది. మాస్టర్ అమిత్ కుమార్ రాము అనే పాత్రలో నటించి మెప్పించాడు.

ఆర్. గోవర్ధనం సంగీతం అందించిన ‘రాము’ చిత్రంలోని పాటలన్నీ అప్పటి ఆడియన్స్ ను ఎంతగానో అలరించాయి. పచ్చనిచెట్టు ఒకటి, రారా కృష్ణయ్య, మంటలు రేపే నెలరాజా, మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ పూయును లే లాంటి పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి.

Leave a comment

error: Content is protected !!