Remake of the Day : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ యన్టీఆర్ నటించిన అద్భుత చిత్రాల్లో రక్తసంబంధం ఒకటి. అన్నచెల్లెళ్ళ సెంటిమెంట్ తో ఆనాటి ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంది ఈ సినిమా కథాంశం. యన్టీఆర్ తో ఎన్నో చిత్రాల్లో కథానాయికగా నటించిన మహానటి సావిత్రి .. ఈ చిత్రంలో మొదటి సారిగా ఆయన చెల్లెలిగా నటించి ఈ సినిమాకే వన్నె తెచ్చారు. సరిగ్గా 62 ఏళ్ళ క్రితం విడుదలైంది ఈ సినిమా. దేవిక, కాంతారావు, సూర్యాకాంతం ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. వి. మధుసూదనరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

నిజానికి ఈ సినిమా శివాజీ గణేశన్ నటించిన పాశమలర్ తమిళ చిత్రానికి రీమేక్ వెర్షన్. ఇందులో కూడా శివాజీకి చెల్లెలిగా నటించి మెప్పించారు సావిత్రి. తమిళంలో సూపర్ హిట్ అవడంతో రాజ్యలక్ష్మి పిక్చర్స్ వారు రీమేక్ రైట్స్ కొని యన్టీఆర్ తో ఈ సినిమా తెరకెక్కించారు. తెలుగు వెర్షన్ కు ముళ్ళపూడి వెంకటరమణ స్ర్కిప్ట్ అందించడం విశేషం. ఘంటసాల అందించిన సంగీతం రక్తసంబంధం చిత్రానికే హైలైట్. ముఖ్యంగా చందురుని మించు అందమొలికించు పాట ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలిచిపోయింది.

Leave a comment

error: Content is protected !!