Remake of the Day : నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన సూపర్ హిట్ ఫ్యామిలీ లవ్ స్టోరీ ‘ప్రేమించిచూడు’. పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్ పై వి. వెంకటేశ్వర్లు నిర్మాణంలో పి. పుల్లయ్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రాజశ్రీ, కాంచన హీరోయిన్స్ గా నటించారు. జగ్గయ్య, రేలంగి, గుమ్మడి, శాంతకుమారి, చలం, గిరిజ, అల్లు రామలింగయ్య, రావికొండలరావు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. చక్కటి కుటుంబ కథకు మంచి హాస్యం తోడవడంతో ఈ సినిమాకు మంచి జనాదరణ దక్కింది.

నిజానికి ఈ సినిమా సూపర్ హిట్ తమిళ చిత్రం ‘కాదలిక్క నేరమిల్లై’ కు రీమేక్ వెర్షన్. టీయస్ బాలయ్య, ఆర్. ముత్తురామన్, రవిచంద్రన్ తదితరులు నటించిన ఈ సినిమాకు సి.వి.శ్రీధర్ దర్శకుడు. ఆ సినిమా రీమేక్ రైట్స్ కొని .. ముళ్లపూడి వెంకటరమణను రైటర్ గా నియమించుకొని పి. పుల్లయ్య ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించారు. ముళ్ళపూడి స్ర్కిప్ట్ తో పాటు మేడమీద మేడ కట్టి అనే పాట కూడా రాయడం విశేషం. ఆ తర్వాత ఇదే సినిమాను హిందీలో ప్యార్ కియే జా గా రీమేక్ చేశారు. కిశోర్ కుమార్, మహమ్మూద్ ప్రధాన పాత్రల్లో నటించారు.

 

Leave a comment

error: Content is protected !!