Remake of the Day : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ యన్టీఆర్ నటించిన చిత్రాల్లో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కి శతదినోత్సవం జరుపుకున్న చిత్రం ‘ఎదురీత’. 1977, జూలై 22న విడుదలైన ఈ సినిమా 47 ఏళ్లు పూర్తి చేసుకుంది. వి.మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వాణీశ్రీ హీరోయిన్ గా నటించింది.

జయసుధ, జగ్గయ్య, కాంతారావు, సత్యనారాయణ, సారథి, కమెడియన్ బాలకృష్ణ , పద్మనాభం, ముక్కామల, సాక్షి రంగారావు, రమణమూర్తి, జగ్గారావు ఇతర ముఖ్యపాత్రధారులుగా నటించారు. ఈ చిత్రానికి సత్యానంద్ మాటలు రాయగా, పాటలను శ్రీశ్రీ, కొసరాజు, వేటూరి పలికించారు. సత్యం సంగీతం సమకూర్చారు. “ఎదురీతకు అంతం లేదా…”, “ఈ రాధ చివరికి ఏమైనా…”, “బాలరాజు బంగారు సామీ…”, “తొలిసారి ముద్దివ్వమంది…”, “తాగితే ఉయ్యాల…”, “గోదారి వరదల్లో…” అంటూ సాగే పాటలు అలరించాయి.

నిజానికి ఈ సినిమా బెంగాలీ కథానాయకుడు ఉత్తమ్ కుమార్ నటించిన విజయవంతమైన హిందీ చిత్రం అమానుష్ కు రీమేక్ వెర్షన్. దీన్ని బెంగాలి, హిందీ ద్విభాషా చిత్రంగా రూపొందించారు. హీరోను ప్రేమించిన అమ్మాయే ద్వేషిస్తూ ఉండడం, చేరువనే చెలి ఉన్నా ఆమె మనసులో హీరో చివరిదాకా చోటు సంపాదించక పోవడం ఇందులోని ప్రధానాంశం. యన్టీఆర్  తాగుబోతుగా నటించడం ఈ సినిమాలోని వైవిధ్యమైన అంశం.  అదే జనానికి కొత్తగా అనిపించడంతో సినిమా మంచి సక్సెస్ సాధించింది.

Leave a comment

error: Content is protected !!