Remake of the day : విశ్వ విఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీఆర్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘నేరం నాదికాదు ఆకలిది’. యస్ డి లాల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా 1976 లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది. రవి చిత్ర బ్యానర్ పై వైవీ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రైమ్ అండ్ పనిష్మెంట్ కథాంశం తో ఈ సినిమా తెరకెక్కింది. మంజుల హీరోయిన్ గా నటించగా, లత, మురళీమోహన్, త్యాగరాజు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

నిజానికి ఈ సినిమా ‘రోటి’ హిందీ మూవీ కి రీమేక్ వెర్షన్. రాజేష్ ఖన్నా హీరో గా నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది. మన్మోహన్ దేశాయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని కొద్దిపాటి మార్పులతో నేరం నాదికాదు ఆకలిది గా రీమేక్ చేసి ఎన్టీఆర్ కి మంచి విజయాన్ని అందించారు మేకర్స్.

Leave a comment

error: Content is protected !!