Remake of the Day :  శ్రీకాంత్ హీరోగా నటించిన చిత్రాల్లోకెల్లా సూపర్ హిట్టయిన ఫుల్ లెంత్ కామెడీ మూవీ ‘ఆడుతూ పాడుతూ’. దేవీ ప్రసాద్ దర్శకత్వంలో సీవీ ఆర్ట్స్ పతాకంపై సీవీ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2002లో విడుదలైంది. సునీల్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, యమ్. యస్. నారాయణ, గౌతమ్ రాజు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.

నిరుద్యోగి అయిన హీరో .. ఒక పాత డొక్కుబసుతో తన జీవనాన్ని కొనసాగించడం ఈ సినిమా ప్రధాన కథాంశం. సినిమాలోని చాలా భాగం ఈ బస్సులోనే చిత్రీకరించడం గమనార్హం. ఈ సినిమాతో గాయత్రి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది. బస్సు నేపథ్యంలో వచ్చే శ్రీకాంత్, సునీల్ ద్వయం కామెడీ చెక్కిలిగింతలు పెడుతుంది.

నిజానికి ఆడుతూ పాడుతూ సినిమా మలయాళంలో సూపర్ హిట్టైన ‘ఈ పరక్కుం తళిక’ (ఈ ఫ్లైయింగ్ సాసర్ ) కు అఫీషియల్ రీమేక్. మాలీవుడ్ లో దిలీప్, హరిశ్రీ అశోకన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి తాహా దర్శకుడు. నిత్యాదాస్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను మలయాళంలోనే కల్ట్ క్లాసిక్ కామెడీ మూవీగా పరిగణిస్తారు.

Leave a comment

error: Content is protected !!