Remake of the day : మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలన్నిటిలోనూ ఒక ప్రత్యేకతను సంత రించుకున్న చిత్రం ‘ఆరాధన’ అని చెప్పాలి. అప్పటికే యాక్షన్ హీరోగా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆయన. ఆ ఇమేజ్ నుంచి బైటికొచ్చి డిఫరెంట్ మూవీ చేయాలంటే.. ఎన్నో గట్స్ కావాలి. ఈ విషయంలో చిరును అభినందించక తప్పదు. ‘ఆరాధన’ చిత్రం టాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఒక రౌడీ.. ఒక టీచర్ ప్రేమలో పడి.. ఆమె ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అన్నదే కథాంశం.

టీచర్ గా సుహాసిని నటించారు. అలాగే యాంగ్రీమేన్ రాజశేఖర్ ఒక ముఖ్యపాత్రలో కనిపిస్తారు. భారతీరాజా దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. నిజానికి ఈ సినిమా సత్యరాజ్ హీరోగా తమిళంలో వచ్చిన సూపర్ హిట్ ‘కడలోర కవితైగళ్’ చిత్రానికి రీమేక్ వెర్షన్. సత్యరాజ్, రేఖ జోడీగా భారతీయరాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్కడ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు తమిళంతో పాటు తెలుగులోనూ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్సే .

Leave a comment

error: Content is protected !!