Raviteja – Srileela : కథానాయకుడు రవితేజ 75వ సినిమా ఇది వరకే అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రం వచ్చే నెల నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మిగిలిన ప్రధాన తారాగణాన్ని ఖరారు చేసే పనిలో చిత్ర బృందం బిజీగా ఉంది.  రవితేజకు జోడీగా ఈ చిత్రంలో శ్రీలీలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

ఇప్పటికే ‘ధమాకా’ సినిమాలో కలిసి నటించిన ఈ జంట మళ్లీ కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘ధమాకా’ సినిమా బాక్సాఫీస్‌ ముందు మంచి విజయాన్ని దక్కించుకున్న నేపథ్యంలో ఈ చిత్రంపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

 

Leave a comment

error: Content is protected !!