Raviteja : మాస్ మహరాజ్ రవితేజ మాట ఇచ్చాడంటే చేసి తీరుతాడని మరోసారి నిరూపించుకున్నాడు. తన అభిమాని అయిన బుల్లితెర నటుడు అమర్ దీప్ కి సినిమా ఛాన్స్ ఇచ్చాడు. బుల్లితెర మీద మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్, రవితేజ అభిమాని. రవితేజ తో నటించాలనే కల అతనికి చాలా కాలంగా ఉంది. ఈ కల నెరవేర్చడానికి అమర్ దీప్ చాలా కష్టపడ్డాడు.

“బిగ్ బాస్ సీజన్ 7” లో పాల్గొన్న అమర్ దీప్, రవితేజ తో నటించాలని కోరికను హోస్ట్ నాగార్జున కు చెప్పాడు. ఫైనల్ ఎపిసోడ్ లో అమర్ దీప్ ఎలిమినేట్ అయినప్పుడు, రవితేజ అతనికి ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. అలానే, రవితేజ తన మాట ప్రకారం “మిస్టర్ బచ్చన్” సినిమాలో అమర్ దీప్ కి ఒక పాత్ర ఇచ్చాడు. షూటింగ్ లో పాల్గొన్న అమర్ దీప్, రవితేజ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

ఈ ఛాన్స్ తో చాలా సంతోషంగా ఉన్న అమర్ దీప్, “ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. నా దేవుడు నువ్వేనయ్యా.. ఫ్యాన్ బోయ్ మూమెంట్” అంటూ రాసుకొచ్చాడు. బిగ్ బాస్ తర్వాత అమర్ దీప్ కి సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి. కానీ, సిల్వర్ స్క్రీన్ మీద రాణించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అమర్ దీప్ ఈ సవాల్ ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!