• అతడు నటించడు .. బిహేవ్ చేస్తాడు. భారీ డైలాగులు చెప్పడు.. ఎవరో మన ఇంటి పక్క అబ్బాయి మనతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. అంత హ్యాండ్సమ్ కూడా కాదు. నార్మల్ ఫేస్ కట్ తోనే .. నవ్వును అతికించి అంత్యంత సహజంగా తెరమీద చెలరేగుతాడు. అతడి పేరు రవితేజ. ‘నేలటిక్కెట్టు’ ప్రేక్షకులు అతడికి ముద్దుగా ‘మాస్ మహారాజా’ అనే బిరుదును తగిలించి మురిసిపోతూ ఉంటారు. రవితేజ అంటే ఎనర్జీ .. ఎనర్జీ అంటే రవితేజ. 50 ప్లస్ ఏజ్ లో కూడా దాని లెవెల్స్ ఏమాత్రం తగ్గవు. పాత్రను ఓన్ చేసుకొని, దానికి తనదైన శైలిలో మ్యానరిజాన్ని జోడించి, దానికి కామెడీ టచ్ ఇచ్చి.. మాస్ జనానికి మహా ట్రీట్ ఇవ్వడమే అతడికి తెలిసిన విద్య. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా. తన సినిమాలతో ఇంత కాలం అదే ఇమేజ్ తో ఇంకా అతడు ‘డిస్కోరాజా’ గానే అభిమానుల గుండెల్లో ఉన్నాడు. టాలీవుడ్ కు వచ్చిన కొత్తలో లైట్ బాయ్ గానూ, అసిస్టెంట్ గానూ పనిచేశాడు రవితేజ. ఆ తర్వాత క్రమంగా అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. చిన్న చిన్న పాత్రలతో పలు చిత్రాల్లో కనిపించాడు. అతడికి తెరమీద ఎలా నటించాలో తెలియదు కాబట్టి.. హీరో అవుదామనే ఆలోచన ముందుగా అతడికి రాలేదు. కేవలం బిహేవ్ చేయడం మాత్రమే తెలుసని.. దర్శకుడు కృష్ణవంశీ పసిగట్టాడు. దాని ఫలితంగా రవితేజను మొట్టమొదటి సారిగా ‘సిందూరం’ సినిమాతో హీరోగా తెరకు పరిచయం చేశాడు. అతడికది మొదటి సినిమా అనే ఫీలింగ్ ప్రేక్షకుడికి ఎక్కడా కలగకుండా.. సహజశైలిలో నటించి.. రవితేజ అంటే నేచురల్ యాక్టర్ అని అప్పుడే నిరూపించుకున్నాడు.
  • పూరీ జగన్నాథ్ ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం , ఇడియట్’ చిత్రాలు రవితేజకు టాలీవుడ్ లో హీరోగా దిశా నిర్దేశం చేశాయి. ఆ తర్వాత ‘అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, వీడే, భద్ర, చిత్రాలు అతడికి స్టార్ డమ్ తీసుకొచ్చాయి. ఇక రాజమౌళి ‘విక్రమార్కుడు’ మూవీ అయితే.. రవితేజ కెరీర్ కు ల్యాండ్ మార్క్ మూవీ అయిపోయింది. ఆ తర్వాత చాలా సినిమాలు అతడి కామెడీ టైమింగ్ కు, ఎనర్జీకి కేరాఫ్ అడ్రెస్ గా మారాయి. నేడు రవితేజ బర్త్ డే . ఈ సందర్భంగా ఆ నిలువెత్తు ఎనర్జీకి విషెస్ తెలుపుతోంది మూవీ వాల్యూమ్. హ్యాపీ బర్డ్ తే రవితేజ.

Leave a comment

error: Content is protected !!