మూవీ: రామారావు ఆన్ డ్యూటీ
నటీనటులు: రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, చైతన్యకృష్ణ, తనికెళ్ళ భరణి, రాహుల్ రామకృష్ణ, అన్వేషి జైన్ తదితరులు.
ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్.
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
సంగీత దర్శకుడు: సామ్ సి.ఎస్.
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం : శరత్ మండవ
విడుదల తేదీ : జులై 29, 2022

క్రాక్ మూవీ తో ఫామ్ లో ఉన్న హీరో మాస్ మహారాజా రవితేజ. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడంలో ఎప్పుడు ముందుంటారు రవితేజ. కొత్త దర్శకుడు శరత్ మండవ ని పరిచయం చేస్తూ “రామారావు ఆన్ డ్యూటీ” అనే సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి నిర్మాత సుధాకర్ చెరుకూరి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, సీసా సాంగ్ సినిమాపై బజ్‌ను క్రియేట్‌ చేశాయి. ఈ వారం రీలిజ్ అయ్యిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో లేదో చూద్దాం.

కథ: రామారావు (రవితేజ) నీతి నిజాయతి గల ఒక డిప్యూటీ కలెక్టర్ (MRO). దూకుడు తనం వల్ల సొంతూరు “తిమ్మ సముద్రంకు” ట్రాన్సఫర్ అవుతాడు. అక్కడ తన మాజీ ప్రేమికురాలు మాలిని (రజీషా విజయన్)ను కలవడంతో, తన భర్త సురేందర్ (చైతన్య కృష్ణ) ఏడాది పాటుగా కనిపించట్లేదు అని తెలుసుకొంటాడు. ఆ కేస్ ని ఆరా చేస్తున్న సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన బిజినెస్ అని అర్ధమవుతుంది.. ఆ స్మగ్లింగ్‌ లో దాదాపు 20 మంది కనిపించకుండా పోయారనే విషయం రామారావుకు తెలుస్తుంది. ఎస్సై మురళి (వేణు తొట్టెంపూడి) పాత్ర ఏంటి? అతనికి స్మగ్లింగ్‌ కి సంబంధం ఉందా? మరి రామారావు తన డ్యూటీని సంక్రమంగా చేశాడా? లేదా? అన్నదే కథ.

కథనం, విశ్లేషణ: సమ్మెత గాంధీ తో ఇంట్రస్టింగ్ గా సినిమా ప్రారంభమవ్వుతుంది. ఆ తరువాత రవితేజ ఇంట్రడక్షన్ స‌బ్ క‌లెక్ట‌ర్ క్యారెక్టర్ లో కొత్తగా స్క్రీన్ మీద కనిపిస్తాడు. ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడు పోరాడే ర‌వితేజ రైతుల విష‌యంలో తన ఉద్యోగాన్నే వ‌దులుకొని సొంతూరు కి ఎంఆర్వో గా వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అక్కడ తన మాజీ ప్రియురాలు మాలిని (రజీషా విజయన్)ను కలవడం.. తన భర్త ఏడాది పాటు కనిపించట్లేదు అని తెలుసుకొని ఆరా తీయడం. ఇక్కడ దాకా బాగున్నా, మాలిని & రవితేజ లవ్ ట్రాక్ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. అక్కడక్కడ వచ్చే సీన్స్ చాలా ల్యాగ్ అనిపిస్తాయి. అలా సీన్లు ముందుకు వెళ్తుంటే రాహుల్ రామకృష్ణ ఇచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది.

 

ప్రథమార్థం లో ఆ 20 మంది ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తుండగా కనపడకుండా పొయ్యిన వాళ్ళని వెతికే పని లో రామారావ్ రంగంలోకి దిగడం. నందిని (దివ్యాంశ కౌశిక్) క్యారెక్టర్ సినిమాలో పెద్దగా లేకపోవడం, పైగా తన డబ్బింగ్ కూడ సరిగ్గా సింక్ అవ్వకపోవడం ఇలాంటివి మైనస్ అనే చెప్పాలి. సినిమాలో వేణుతొట్టంపూడి ఎస్సైగా వచ్చిన ప్రతి సీన్స్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తాయి. అలాగే సీసా సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సిచ్యువేషన్ కి తగ్గట్టుగా అన్ని సాంగ్స్ రాకపోవడం. సినిమాలో సరైన విలనిజం చూపించకపోయిన, రామారావు తండ్రి(నాజర్‌) హత్య వెనక దాగి ఉన్నగ్యాంగ్ ని సస్పెన్స్ క్యారీ చేయడం బాగున్నాయి.

నటి నటులు: ఎప్పటిలాగే మాస్ మహారాజా ఎనర్జిటిక్ గా కనిపిస్తూ సినిమా మొత్తం తన భుజాల మీద వేసుకున్నాడు. రవితేజ మునుపెన్నడూ లేని విధంగా కొత్త లుక్స్ తో, నటన తో వావ్ అనిపించుకున్నాడు. ఇకపోతే వేణుతొట్టంపూడి ఎస్సైగా ప్రేక్షకులని ఆకట్టుకొని బౌన్స్ బ్యాక్ అయ్యాడనే చెప్పాలి. దివ్యాంశ కౌశిక్ అందచందాలతో ఎంట్రాక్టివ్ గా నిలిచింది. రజిషా విజయన్ స్క్రీన్ ఉన్నంత సేపు బాగానే రాణించారు. ఇకపోతే, నాజర్, చైతన్యకృష్ణ, తనికెళ్ళ భరణి, రాహుల్ రామకృష్ణ తదితరులు బాగానే ఆకట్టుకున్నారు.

 

సాంకేతిక వర్గం:డైరెక్టర్ శరత్ మండవ కథ ని చెప్పడానికి ట్రై చేసిన, సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోవడం, దానికి ప్రేక్షకులు కనెక్ట్ కాకపోవడం. 90’స్ లో జరుగుతున్నట్టుగా కథ అనిపించదు. కాస్ట్యూమ్స్ అయ్యితే అసలు సంబంధం లేకుండా ఉంటాయి. శామ్ సీఎస్ సంగీతం, నేపథ్యం సంగీతం పర్వాలేదు. సత్యన్ సూర్యన్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్ కి ఇంకా పని చెప్పాలిసింది. ప్రొడక్షన్ బాగానే ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది.

బాటమ్ లైన్ : తడబడ్డ “రామారావ్”

రేటింగ్: 2.5/5

రివ్యూ : తిరుమలశెట్టి వెంకటేష్

గమనిక: ఈ రివ్యూ క్రిటిక్ అభిప్రాయం మాత్రమే

Leave a comment

error: Content is protected !!