యువత ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో పెడదోవ పట్టడానికి రేవ్‌పార్టీలు ఓ కారణం. కానీ రేవ్ పార్టీల ద్వారా యువతకు జరిగే నష్టం ఏంటి ? వీటి వలన సమాజానికి చెడు పరిణామాలు ఎదురవుతాయనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడిదే మెయిన్ కంటెంట్‌గా ఓ సినిమా రాబోతుంది. రేవ్ పార్టీ పేరుతో రాబోతున్న ఈ సినిమాను బొనగాని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రాజు బొనగాని డైరెక్షన్‌లో రూపొందించారు. క్రిష్ సిద్దిపల్లి, రితిక చక్రవర్తి, ఐశ్వర్య గౌడ, సుచంద్ర ప్రసాద్, తారక్ పొన్నప్ప మెయిన్ క్యాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 35 రోజుల్లో షూటింగ్ జరుపుకుంది.
ఈ చిత్రాన్ని ఉడిపి, గోవా, బెంగళూరు ప్రదేశాల్లో ఎక్కువ భాగం చిత్రీకరించారు. సాధారణంగా రేవ్ పార్టీలు ఎక్కువ జరిగే ప్రదేశాలివే కావడంతో ఇక్కడే చిత్రీకరించినట్టు మేకర్స్ తెలియజేసారు.సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషలలో విడుల చేస్తున్నారు. క్రిష్ సిద్దిపల్లి హీరోగా, రితిక చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఐశ్వర్య గౌడ రేవ్ పార్టీ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.
షూటింగ్ ముగించుకున్న రేవ్ పార్టీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు ఆగస్ట్ లో చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు డైరెక్టర్ రాజు బొనగాని తెలిపారు.