రవితేజ హీరోగా , అభిషేక్‌ పిక్చర్స్‌ తో కలిసి నిర్మాణంలో భాగం పంచుకుంటూ తీసిన సినిమా రావణాసుర. ఈ టైటిల్‌తో విపరీతమైన హైప్ వచ్చింది. హీరోస్‌ డోన్ట్ ఎగ్జిస్ట్‌ ఈ ట్యాగ్‌లైన్‌ ను జస్టిఫై చేసేలా నెగిటివ్‌ టైటిల్‌తో సుధీర్‌ వర్మ డైరెక్షన్‌లో ఏప్రిల్‌ 7 న రిలీజ్ అయ్యింది రావణాసుర. థీమ్‌ సాంగ్‌తో గూస్‌బంప్స్‌ తెప్పించిన రావణాసుర టీమ్‌.. సినిమాను కూడా అదే థ్రిల్‌ ఇస్తూ ఆడియెన్స్‌ను మెప్పించారా..? నిరాశ పర్చారా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

 

కథ :
రవీంద్ర (రవితేజ) లాయర్‌ కనకమహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గర జూనియర్‌ లాయర్‌గా పనిచేస్తుంటాడు. కనకమహాలక్ష్మికి , రవీంద్రకి లవ్‌ ఎఫైర్ ఉందన్న టాక్‌ ను అడ్డం పెట్టుకుని ఓ కేసు నిమిత్తం వచ్చిన హారిక (మేఘా ఆకాశ్‌)కు లైన్ వేస్తుంటాడు. హారిక తండ్రి (సంపత్‌రాజ్‌) ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు. కానీ ఆ మర్డర్‌ చేసింది హారిక తండ్రి కాదంటూ తన కేసు టేకప్ చేయాలంటూ కనకమహాలక్ష్మి దగ్గరకు వస్తుంది. ఎవిడెన్స్‌ లన్నీ హారికా తండ్రివైపే వేలెత్తి చూపిస్తుండటంతో ఆ కేసు వాదించడానికి ఒప్పుకోదు. కానీ రవి కాళ్లు పట్టుకుని ఒప్పిస్తాడు. అలా లైన్‌ వేసిన రవీంద్రనే హారికా ను లైంగికంగా వేధించి మరీ చంపేస్తాడు. ఎందుకలా చేసాడు.. ఈ ప్రాసెస్‌లో ఒకే ప్యాటర్న్‌లో జరిగే మర్డర్స్‌, అది ఛేదించడానికి వచ్చిన పోలీసాఫర్‌ (జయరాం )తో రవి టామ్‌ అండ్ జెర్రీ గేమ్.. ఈ కథలో అక్కినేని హీరో సుశాంత్‌ పాత్రేంటి ? హారికను రవి ఎందుకు చంపాడు.. చివరికి పట్టుబడ్డాడా అనేది తెరమీద చూడాల్సిందే.

విశ్లేషణ :
మర్డర్ మిస్టరీలకు కథ కొత్తగా ఉండక్కర్లేదు. కానీ మిస్టరీని ఛేదించే క్రమం థ్రిల్లింగ్ ఉంటే చాలు.. రావణాసుర ఇలాంటి జోనర్‌నే ఎంచుకుంది. అయితే ఓ స్టార్‌ ఇమేజ్‌ వచ్చాక మర్డర్ మిస్టరీ కథలను ఎంచుకోవడం అంటే సాహసమే. కమర్షియల్ ఈక్వేషన్స్‌తో పాటు ఇమేజ్‌ పరిధి దాటి నటించాల్సి రావడం ఇంకా పెద్ద ఛాలెంజ్‌. అలాంటి సాహసమే రవితేజ చేసాడు. కాకపోతే ఇక్కడ టాస్క్‌ పర్‌ఫెక్ట్‌గా పూర్తి చేయాల్సింది స్క్రీన్‌ప్లే. డైరెక్టర్‌గా సుధీర్‌ వర్మ చాలా వరకు న్యాయం చేయడానికి ప్రయత్నించాడు. కానీ కథ రొటీన్‌ కావడం పెద్ద అడ్డంకిగా మారింది. అయితే ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో కథను పరిగెత్తించాడు. వాస్తవానికి ఈ సినిమా మర్డర్‌ మిస్టరీ కాదు. ఎందుకంటే ఎక్కడికక్కడ మర్డర్స్ చేసిందెవరో తేలిపోతూనే ఉంటుంది. మర్డర్‌ చేసిందెవరో ఇన్విస్టిగేషన్‌ చేస్తున్న పోలీసాఫీసర్‌కు కూడా తెలిసిపోతుంది. అయితే దొరికిపోకుండా తప్పించుకునే ప్రాసెస్సే ఆడియెన్స్‌ను థ్రిల్ చేసే అంశం. రావణాసుర అలాంటి థ్రిల్ ఇస్తుంది. అప్రతిహాతంగా కిల్లర్‌ వీర విధ్వంసానికి అడ్డుకట్ట వేసే బలమైన పాత్ర ఎక్కడా కనిపించదు. పోలీసాఫీసర్స్‌తో సహా అందరూ కిల్లర్ హీరోయిజానికి దాసోహం అనేలాగా ఉంటాయి సీన్స్‌ అన్నీ. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఓ ఫ్లాష్ బ్యాక్‌.. ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో ఓ ముఠా సమాజానికి చేటు చేయడమే కాకుండా తన కుటుంబానికి తీవ్ర నష్టం జరగడం.. ఆ ముఠా ఆగడాలను అడ్డుకట్ట వేయాలనుకునే ఓ డాక్టర్‌ అతి దారుణంగా చంపబడటం.. వాళ్లెలా దుర్మార్గం చేసారో.. ఆ ముఠాలో ఉన్నవాళ్లందరినీ కిల్లర్‌ అదే తరహాలో చంపడం. ఇలాంటి కథలెన్నో వచ్చాయి. మాస్క్‌నుపయోగించి మర్డర్స్ చేయడం తెలివిగా తప్పించుకోవడం అనేది సుధీర్‌ వర్మ బాగా డ్రైవ్‌ చేసాడు. అయితే ఫ్లాష్‌బ్యాక్ రొటీన్ కావడం, తేలిపోవడంతో అప్పటిదాకా ఆడియెన్‌ ఫీల్ అయిన ఎమోషన్‌ కూడా తేలిపోతుంది.

నటీనటుల పర్‌ఫార్మెన్స్‌ :
రవితేజ ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతాడనేది మరోసారి ప్రూవ్ అయ్యింది. నెగిటివ్ క్యారెక్టర్స్‌ తో సినీ ఎంట్రీ ఇచ్చిన రవితేజ స్టార్‌డమ్‌ వచ్చాక చివరి వరకు నెగిటివ్‌ షేడ్‌ ను మోస్తూ కథను నడపడం మెప్పించేలా నటించడం నిజంగా శెభాష్ అనాల్సిందే. హీరోస్ డోన్ట్ ఎగ్జిస్ట్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్‌..కానీ ఉండటానికి ఈ సినిమాలో ఐదుగురు ఫీమేల్ లీడ్‌ కనిపిస్తారు కానీ హీరోయిన్‌ డోన్ట్‌ ఎగ్జిస్ట్ అని చెప్పక తప్పదు. అను ఇమ్మాన్యుయేల్‌ పరిస్థితి మరీ దారుణం. ఓ మసాలా ఇంటిమసీ సీన్‌కు తప్ప ఆ క్యారెక్టర్‌కు ఉనికే లేకుండా చేసారు. ఉన్నంతలో మేఘా ఆకాశ్‌, పూజితా పొన్నాడకు కాస్త స్కోప్ దక్కింది. దక్షా నగార్కర్‌ పర్వాలేదనిపించుకుంది. రవితేజకు ప్రధాన బలమైన హ్యూమర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సినిమాకు ప్రధాన లోపం. హైపర్‌ ఆది సపోర్ట్ చేసాడు కానీ.. అందుకు తగ్గ సీన్స్‌ లేకుండా పోయాయి. పోలీసాఫీసర్ పాత్రలో జయరాం బాగా చేసాడు. మురళీ శర్మ, రావు రమేష్‌ ఇచ్చిన పాత్రల్లో కనిపించి వెళ్లిపోతారంతే.

టెక్నికల్ టీమ్‌ :
సుధీర్‌ వర్మ తీసుకున్న లైన్‌ను థ్రిల్లింగ్‌ గా చెప్పాలనుకున్నాడు. ఆ పని ఫ్లాష్ బ్యాక్‌ వరకు బాగా చేసాడు. ఆ తర్వాత ఇక రవితేజ ఎలివేషన్‌ను కమర్షియల్ ఎలిమెంట్స్‌ను నమ్ముకోక తప్పని పరిస్థితి. హర్షవర్ధన్‌, రామేశ్వర్‌, భీమ్స్‌ సిసిరోలియో సాంగ్స్‌ విజువల్‌గా అంతలా రిజిస్టర్‌ అయ్యేలా లేవు కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ బాగుంది. సినిమాటోగ్రఫీ కి మంచి మార్కులు పడతాయి. మొదట్లో కాస్త ల్యాగ్ అనిపించినా ఆ తర్వాత నవీన్‌ నూలి ఎడిటింగ్ వర్క్‌ సూపర్బ్‌ అనిపిస్తుంది.

బోటమ్‌ లైన్‌ : రొటీనే కానీ థ్రిల్లింగ్‌ యాక్షన్ డ్రామా

రివ్యూ – ఉపేందర్

Leave a comment

error: Content is protected !!