మాస్ మహారాజా ‘రవితేజ’ హీరో గా దక్షా నాగర్కర్, అను ఇమ్మాన్యల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ ఐదు ముద్దు గుమ్మలతో జత కట్టిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’. యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘సుధీర్ వర్మ’ దర్శకత్వం వహించారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్స్ ఆధ్వర్యంలో అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మిస్తున్నఈ చిత్రం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 7న ‘రావణాసుర’ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

హోరా హోరి, హుషారు, జాంబీ రెడ్డి, బంగార్రాజు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకున్నయంగ్ హీరోయిన్ ‘దక్షా నాగర్కర్’.
చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ‘దక్షా నాగర్కర్’ ఒక నటిగా అన్ని రకాల పాత్రలతో గుర్తింపు తెచ్చుకోవాలని తెగ కృషి చేస్తుంది. ఇటివలే, యాక్టింగ్ కోర్స్ పూర్తిచేసి ‘స్టార్ హీరోస్’ తో జత కట్టే పని లో ఉంది.

 

నాగ చైతన్య ‘బంగార్రాజు’ సినిమా ఈవెంట్ లో నాగచైతన్య కి కన్ను కొట్టిన విడియో యూట్యూబ్ లో చెక్కర్లు కొడుతుంది. ఆ వీడియోతో విపరీతంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ ఢిల్లీ భామ మ్యాజిక్ అలాంటిది. త్వరలో రీలిజ్ కానున్న ‘రావణాసుర’ మూవీలో స్కోప్ వుండే సస్పెన్స్ పాత్ర చేసిందట, ఆ పాత్ర కి ప్రేక్షకులు తప్పకుండ థ్రిల్ అవ్వాలిసిందే అని చెప్తుంది. మాస్ మహారాజా ‘రవితేజ’ వ్యక్తిత్వం చాలా గొప్పది, సెట్స్ లో చాలా సరదాగా వుంటారు. ఆయనతో కలిసి యాక్ట్ చేసే అదృష్టం కలగడంతో తెగ ఎక్సయిట్ అవ్వుతుంది.

దర్శకుడు సుధీర్ వర్మ గత చిత్రాలు చూసి ఇష్టం పెంచుకున్న ఈ భామ. కథ చెబుతుంటే సినిమా చుసిన అనుభూతి కలిగిందట. ఈ సినిమా లో మిగతా స్టార్డం హీరోయిన్స్ ఉన్న, తన పాత్ర నచ్చడంతో ఓప్పుకుందట. సుశాంత్ ని ఈ సినిమాలో చాలా కొత్తగా చూస్తారు అని చెప్తు టీం అందరం కష్టపడి ది బెస్ట్ ఇచ్చాం అంటుంది. ఈ భామ రీసెంట్ గా ‘రెండు’ సినిమాలకి సైన్ చేసి, వరుస ఆఫర్లతో దూసుకువెళ్ళిపోతుంది.

Leave a comment

error: Content is protected !!