ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేని RAPO 22 తో సందడి చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రాబోతున్న ఈ కొత్త మూవీకి యంగ్‌ డైరెక్టర్‌ మహేష్‌బాబు . పి దర్శకత్వం వహిస్తున్నాడు. మన సాగర్‌ గాడి లవ్వు… మహాలక్ష్మీ అంటూ హీరో హీరోయిన్లతో పోస్టర్‌ రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో రామ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. చుడీదార్‌తో ట్రెడిషనల్‌ లుక్‌లో భాగ్యశ్రీ, రామ్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్‌తో ఈ పోస్టర్‌ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది.

వాస్తవానికి టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు. న్యూ ఇయర్‌ సందర్భంగా రిలీజ్‌ చేసిన ఈ పోస్టర్‌ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ షూట్ కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన పాత్రధారులతో కీలక సన్నివేశాలు తీసారు. రామ్‌ , భాగ్యశ్రీ జంట నడుమ వచ్చే సీన్స్ ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్‌ అంటున్నారు.

Leave a comment

error: Content is protected !!