Shopping Cart 0 items - $0.00 0

రాజమౌళి విజయసింహ ఎందుకు ఆగింది?

కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆగిన రాజ‌మౌళి విజ‌య‌సింహ‌. అదేంటి అస‌లు జ‌క్క‌న్న విజ‌య‌సింహ ఎప్పుడూ స్టార్ట్ చేయ‌లేదే. ఇలాంటి డౌట్స్ చాలానే క్రియేట్ అవుతున్నాయి క‌దూ. అస‌లు విష‌యానికొద్దాం.కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌క్క‌న్న డైరెక్ట్ చేసిన ఫ‌స్ట్ మూవీ స్టూడెంట్ నెం.1. ఈ సినిమాకు ముందు వ‌ర‌కు సీరియ‌ల్స్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసారు రాజ‌మౌళి. స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ సూప‌ర్‌హిట్ త‌ర్వాత రాజ‌మౌళి ప్లాన్ చేసిన సెకండ్ ఫిల్మ్ విజ‌యసింహ‌. ఈ చిత్రాన్ని కె. రాఘ‌వేంద్ర‌రావు త‌నయుడు ప్ర‌కాశ్ కోవెల‌మూడితో తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేసాడు రాజ‌మౌళి. అయితే ఆ టైమ్‌లో ప్ర‌కాశ్… ఉషా కిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్‌లో నీతో అనే మూవీ చేస్తున్నాడు. జాన్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది. ఆ ప్ర‌భావం రాజ‌మౌళి విజ‌య‌సింహ పై ప‌డింది. అలా విజ‌య‌సింహ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

Leave a comment

error: Content is protected !!