హ్యాండ్సమ్ ఫేస్ .. మ్యాన్లీ లుక్స్ .. స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ .. ఎట్రాక్టివ్ డైలాగ్ డెలివరీ.. ఎనలేని ఎనర్జీ.. ఉరిమే ఉత్సాహం.. ఆకాశమే హద్దుగా చెలరేగి చేసే యాక్టింగ్ ఇవన్నీ ఒకే హీరోలో ఉంటే.. అతడే రణవీర్ సింగ్. అతడో యూత్ ఐకాన్. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరోస్ లో సూపర్ స్టార్ అతడే. వైవిధ్యమైన కథల్ని ఎంపికచేసుకొనే టాలెంట్ .. కొత్త తరహా పాత్రలు ధరించే సత్తా .. పాత్ర పాత్రకి సరికొత్త మేకోవర్ అతడిలోని ఎక్స్ ట్రా క్వాలిఫికేషన్స్. మోడలింగ్ రంగం నుంచి సినీ రంగానికి వచ్చి.. రావడం రావడంతోనే సూపర్ హిట్ సాధించి.. కేవలం పదేళ్ళలోనే సూపర్ స్టార్ డమ్ సంపాదించుకున్న ప్రతిభ అతడిది.
ముంబైలోని సింధీ ఫ్యామిలీకి చెందిన రణవీర్ సింగ్ .. అందాల కథానాయిక సోనమ్ కపూర్ కు కజిన్ వరుస అవుతాడు. బ్లూమింగ్ టన్ లో ని ఇండియానా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్న అతడు.. సినిమాల్లోకి ప్రవేశించడానికి ముందు మోడలింగ్ రంగంలో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. 2010 లో యాష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన బ్యాండ్ బజా బారాత్ చిత్రంతో హీరోగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్టవడంతో .. వరుసగా అవకాశాలు అతడ్ని వరించాయి. రామ్ లీల, బాజీరావు మస్తానీ, పద్మావత్, గల్లీబాయ్ లాంటి చిత్రాలు బాలీవుడ్ లో అతడికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. అందాల దీపికా పదుకొణేని పెళ్ళి చేసుకొని .. ఇప్పుడు వివాహజీవితాన్ని ఆనందంగా అనుభవిస్తున్న రణవీర్ సింగ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆ యంగ్ టాలెంటెడ్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే రణవీర్ సింగ్.