Ranabeerkapoor : బాలీవుడ్‌ యువ హృదయాలను దోచుకుంటున్న స్టార్ హీరో రణబీర్ సినిమాల్లోనే కాకుండా.. ఫ్యాషన్ వరల్డ్‌లోనూ తన ప్రభావాన్ని చూపించడానికి ఆయన సరికొత్త క్లాతింగ్ బిజినెస్ ను ప్రారంభించారు. రణబీర్ కపూర్ తన సొంత ఫ్యాషన్ బ్రాండ్‌కు ‘ARKS’ అని పేరు పెట్టారు. సోషల్ మీడియాలో ఈ బ్రాండ్‌కు సంబంధించిన అధికారిక ఖాతాలు ప్రారంభించబడి, రణబీర్ కపూర్ భార్య ఆలియా భట్, తల్లి ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నారు.

రణబీర్ కపూర్ స్వయంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా లేకపోయినా, ఆయన భార్య, తల్లి సహాయంతో ఈ బ్రాండ్‌ను ప్రజలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. రణబీర్ కపూర్ తన ఈ కొత్త వెంచర్‌కు ప్రేరణగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోలను తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ వంటి హీరోలు తమ సొంత ఫ్యాషన్ బ్రాండ్‌లను ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్న విషయం తెలిసిందే.

రణబీర్ కపూర్‌కు బాలీవుడ్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో, ఆయన పేరు కనిపిస్తే చాలు మార్కెట్‌లో ఆ డ్రెస్‌లు హాట్ కేకుల మాదిరిగా అమ్ముడుపోవడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.  ఇటీవల ‘యానిమల్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రణబీర్ కపూర్ ప్రస్తుతం ‘రామాయణం’ సినిమాలో రాముడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మూడు నాలుగు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2025లో విడుదల కావచ్చు. ఈ సినిమాలో సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ మరియు పరశురాముడిగా ప్రభాస్ నటిస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి.

Leave a comment

error: Content is protected !!