టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ లో దగ్గుబాటి రానా ఒకడు. తన కాంటెంపరర్స్ అయిన రామ్ చరణ్, యన్టీఆర్, అల్లు అర్జున్ పెళ్ళిళ్ళు అయిపోయాయి. అంతెందుకు తన కన్నా చిన్నవాడు, స్వయానా అతడి బావ అయిన అక్కినేని నాగచైతన్య మ్యారేజ్ కూడా అయిపోయింది. ఇక అతడిదే తరువాయి. మరి భళ్ళాల దేవుడి మ్యారేజ్ ఎప్పుడు? అని అభిమానులు , శ్రేయోభిలాషులు ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో .. రానా తన ప్రేమ గురించి సోషల్ మీడియాలో ఓపెన్ అవ్వడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిన్ననే తన ప్రేయసితో కలిసి ఉన్న ఫోటోను జత చేసి ‘ఆమె యస్ చెప్పింది’ అని పోస్ట్ పెట్టాడు రానా .
ఇంతకీ మన భల్లాల దేవుడిని ప్రేమలో పడేసిన ఆ అమ్మాయి ఎవరూ అనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఆరా తీస్తున్నారు. ఆ అమ్మాయి పేరు మిహికా బజాజ్. ముంబై కు చెందిన మిహికా బజాజ్ డ్యూడ్రాప్ డిజైన్ స్టూడియోను నడుపుతున్నది. లండన్ యూనివర్సిటీలో ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ మీద మాస్టర్స్ కంప్లీట్ చేసిన మిహికా బజాజ్ ఇంటీరియర్ డిజైనర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఒక ఆన్లైన్ ఇంటీరియర్ అండ్ ఆర్కిటెక్ట్ మ్యాగజైన్ కి రైటర్ గా కూడా వర్క్ చేసింది. ప్రస్తుతం డ్యూడ్రాప్ డిజైన్ స్టూడియో ఏర్పాటు చేసి ఈవెంట్ అండ్ వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ చేస్తున్నదని తెలుస్తోంది. రానా ఇంస్టాగ్రామ్ పోస్ట్ చూస్తే మన హీరోనే ఆమె వెంటపడ్డాడనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. మరి ఈ వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ విమెన్ టాలీవుడ్ హీరో రానాకు ఎక్కడ కనెక్ట్ అయ్యింది.. ఎప్పటి నుండి ప్రేమాయణం సాగిస్తున్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ పోస్ట్ చూసిన సెలబ్రిటీలు రానా కి కంగ్రాట్స్ చెప్తున్నారు. సమంత అక్కినేని శ్రుతి హాసన్ హన్సిక ఆదా శర్మ మొదలైన వారు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పారు.
And she said Yes 🙂 ❤️ pic.twitter.com/iu1GZxhTeN
— Rana Daggubati (@RanaDaggubati) May 12, 2020