‘ముందు నన్ను చంపి తరువాత నా చెట్ల మీద చెయ్యి వేయండి’ అంటూ…
అడవిలోని చెట్లను నరకటానికి వచ్చిన గ్రామస్తులకు అడ్డుగా నిలబడి తన గొంతుకను వినిపించిన ఓ పదహారేళ్ళ యువకుడు.


అంతేకదా… ప్రాణం పోసిన వారికి కాకపొతే ఆ ప్రాణాన్ని కాపాడడానికి తమ ప్రాణాన్ని పణంగా పెట్టేంతటి మమకారం మరెవరికి వుంటుంది..!?
 ఇది ఒక అడవిని పెంచిన ఓ పర్యావరణ వన ప్రేమికుని కథ… అతడే ‘జాదవ్ పాయెంగ్’ అందరూ పిలుచుకునే ‘ఫారెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ ఇతనిని కథాధారంతో పాటు ‘ఎలిఫెంట్‌ విస్పరర్‌’ లారెన్స్‌ అంటోనీ జీవితాల నుండి స్ఫూర్తితో రూపొందిన చిత్రమే రానా ‘అరణ్య’.

అస్సాంలో 1979వ సం’లో వరదలు సంభవించాయి. ఆ ప్రకృతి వైపరీత్యం వలన ఎన్నో జలచరాలు బ్రహ్మపుత్ర నది ఒడ్డుకి కొట్టుకువచ్చాయి. వరదలు తగ్గిన కొద్ది రోజుల తరువాత నది మధ్యలోని ఇసుకదీవులు వేడెక్కడంతో వేడికి తట్టుకోలేక కొట్టుకొచ్చిన ఆ జలచరాలు అక్కడే పెద్ద సంఖ్యలో సమాధయాయ్యి. ఈ విఘట దృశ్యాలను చూసిన జాదవ్ హృదయం చలించిపోయింది. ఆ తర్వతా అటవీశాఖ అధికారులను సంప్రదించి భవిష్యత్ లో ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదంటే ఆ ఇసుక తెన్నెల వద్ద అడవిని పెంచాలి అనే తన ఆలోచనను తెలిపాడు. కానీ ఆ అధికారులు మాత్రం ఈ ఇసుక నేలళ్ళో ఏ రకమైన మొక్కలు కూడా పెరగవూ… పైగా నువ్వు అంతగా ఏదైన చేయాలనుకునే ఆసక్తి ఉంటె అక్కడ వెదురు లాంటి మొక్కలు ఏవైనా నాటి చూడని సలహా ఇచ్చారు. తను పుట్టిన నేలను ఎలాగైన కాపాడుకుని భవిష్యత్ తరాలకు పచ్చని అడవిని అందించాలనే సంకల్పంతో ప్రకృతి విసిరిన సవాలును స్వీకరించాడు.

జాదవ్ రోజుకొక మొక్క చొప్పున నాటుకుంటూ అసలు పచ్చదనమనే మాటే లేని ఎడారంటి ఇసుక తిన్నులలో మొక్కంటూ మొలవని ఆ నేలపై పచ్చదనం చిగురించి తర్వాత అదే ఓ అడవిగా ఆవిష్కృతమైంది. సుమారు 1,360 ఎకరాల్లో విస్తరించిన ఆ అడవిలో పులులు, ఏనుగులు వంటి ఎన్నో రకాల వన్యప్రాణులకు నివాస కేంద్రంగా అవతరించింది.

బయటి ప్రపంచానికి 2007 వరకు జాదవ్‌ ఓ వనాన్నే సృష్టించాడన్న విషయం ఎవరికీ తెలియదు. ఓ ఫొటోజర్నలిస్ట్‌ జీతూ ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కూడా చాలా చిత్రంగా జరిగిన ఓ సంఘటన… పక్షుల ఫొటోలు తీయడానికి ఓ బోటుపై బ్రహ్మపుత్ర నదిలో వెళ్తున్నా ఫొటోజర్నలిస్ట్‌ జీతూ మాజులీ ద్వీపం వద్దకు రాగానే తన కళ్లను తనే నమ్మలేని ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. మొక్క మొలకెత్తడానికే సందేహించే ఈ నేలపై పచ్చని అడవి ఎలా సాధ్యమని ఆచర్యపోయాడు. ఎవరూ రాని ఆ ప్రదేశానికి జీతూ రావడంతో జాదవ్‌ తనో వన్యప్రాణుల వేటగాడు అని సందేహించాడు తొలుత. జాదవ్‌ భగీరథ యత్నం గురించి తెలుసుకున్న జీతూకు నోట మాట రాలేదు. అక్కడే కొన్ని రోజులున్న జీతూ ప్రపంచానికి ఒక్క వ్యక్తి తలుచుకుంటే ఏమైన సాధించగలడు దానికి ఉదాహరణ జాదవేనని చెబుతారు.
జాదవ్‌కు తాను మొదటిసారి నాటిన మొక్క ఎక్కడుందో కూడా తెలుసు.. ఓ మహారణ్యానికి బీజం వేసిన ఆ వృక్షం వద్దకు రోజుకు ఒక్కసారైనా వెళ్లి.. సేదతీరుతాడు.. నీవు లేనిదే నేను లేనని అంటూ.. ఉదయం 3 గంటలకు నిద్రలేవగానే తన వనం వద్దకు వెళ్ళి. మొక్కలు నాటే పనిలో నిమగ్నమౌతాడు. సమీప గ్రామాల్లో పాలు అమ్మి జీవనం కొనసాగించే జాదవ్‌ నిజంగా హరిత సంపన్నుడే కదా..!
పద్మశ్రీ పురస్కారం.

అప్పటి రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న జాదవ్ పయోంగ్ 22 ఏప్రిల్ 2012న జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ ఏర్పాటు చేసిన బహిరంగ కార్యక్రమంలో జాదవ్ పాయెంగ్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడవిని సృష్టించిన తన అనుభవాన్ని పంచుకున్నారు, ఆ కార్యక్రమంలోనే ఉన్న మాగ్సేసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్, జెఎన్‌యు వైస్-ఛాన్సలర్ సుధీర్ కుమార్ సోపోరీ జాపోవ్ పాయెంగ్‌ను “ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా” గా సోపోరీ పేర్కొన్నారు. అక్టోబర్ 2013 నెలలో మేనేజ్‌మెంట్‌లో వార్షిక ఈవెంట్ కోలెన్సెన్స్ సందర్భంగా ఆయనను సత్కరించారు. 2015 లో భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించారు. ఆయన చేసిన కృషికి అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు కాజీరంగ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టాను అందించింది.

Leave a comment

error: Content is protected !!