రానా హీరోగా నటించిన చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మోన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్ కీలక పాత్రలు పోషించారు.ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ సినిమా తెలుగులో ‘అరణ్య’, హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాడన్ ’ పేర్లతో ఈ నెల 26న విడుదలవుతోంది.
‘అరణ్య’ ఆసక్తికరమైన విషయాలను గురించి రానా మీడియాతో మాట్లాడుతూ…
దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ సినిమా భూమి కోసం, భవిష్యత్ తరాల కోసం పోరాడే వ్యక్తి కథ ‘అరణ్య’ అనగానే ఆసక్తికరంగా అనిపించింది. ఏనుగుల వల్ల అడవుల విస్తీర్ణం పెరుగుతుంది. అది మన భవిష్యత్ తరాలకు మేలు చేస్తుంది. అందుకే ‘అరణ్య’ భవిష్యత్ తరాలకు కూడా చెప్పాల్సిన కథ. ఈ సినిమా షూటింగ్ కోసం 15 రోజులు ముందుగానే థాయ్‌ల్యాండ్‌కు వెళ్లాం. కథ పరంగా 18 ఏనుగులతో మనం షూట్ చేయాల్సి ఉంటుందని ప్రభు చెప్పారు. ఏనుగులను మచ్చిక పెంచుకునేందుకు ఏనుగుల సంరక్షకుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్నాను. సాధారణంగా ఒక ఏనుగు మన పక్కన నడిస్తేనే భూమి కంపిస్తుంది. అలాంటిది ఒకేసారి 18 ఏనుగులతో కలిసి ఉంటూ, షూటింగ్ చేశామంటే మేం ఎంత కష్టపడి ఉంటామో ఊహించుకోవచ్చు.
షూటింగ్ సమయంలో ఓ సారి జేబులో ఉన్న అరటి పండు కొద్దిగా బయటకు వచ్చింది. అది చూసి నా దగ్గర చాలా అరటిపండ్లు ఉన్నాయని హఠాత్తుగా అన్ని ఏనుగులు నా దగ్గరకు వచ్చాయి. ఆ క్షణంలో చాలా భయం వేసింది. అలానే ప్రతిరోజూ షూటింగ్ సమయంలో ఏనుగుల దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను.
జాదవ్ పయేంగ్, ఎలిఫెంట్ విస్పరర్‌గా పిలవబడే లారెన్స్ ఆంథోనీ జీవితాల్లోని సంఘటనలు, కాజీరంగా ఘటనను కూడా ఈ సినిమాలో చూపించాం. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా బిరుదొచ్చాక జాదవ్ పయేంగ్‌ని అని పిలుస్తుంటారు. మా సినిమాకు అరణ్య ఆ టైటిల్ పెట్టడానికి కారణం అదే.
ఈ సినిమా మా బాబాయ్ వెంకటేష్ గారికి, తన మొదటి సినిమా దర్శకుడు శేఖర్ కమ్ములగారికి చూపించడానికి కారణం ఒక్కటే… నేను ఏ క్యారెక్టర్ అయినా చేయలగలను అని మొదటగా నమ్మిన వ్యక్తులు వాళ్లే.. ఈ సినిమాలో నేను బాగా చేయగలిగాను అనే గర్వంతో ఈ సినిమా ప్రత్యేకంగా వారికి చూపించాను.
ఇన్ని వెరైటీ కథలను చేసే నేనే ఇలా లాక్‌డౌన్ వస్తుంది అని కథగా చెప్పినా కూడా నమ్మేవాన్ని కాదేమో.. పోస్ట్ కరోనా మనుషులు, వాళ్ల ఆలోచనలలో ఎంతో చాలా మార్పు తీసుకువచ్చింది. ప్రస్తుతం గ్లోబల్ సినిమాలు ఎక్కడ తీస్తారు అంటే హైదరాబాద్‌లోనే తీస్తాం అనే స్థాయికి మన తెలుగు పరిశ్రమ చేరుకుంది.
నేను నా కేరీర్‌లో అమితాబ్‌గారు, అజిత్ గారిలాంటి డిఫరెంట్ యాక్టర్ లతో నటించే అవకాశం పొందడం గొప్ప అచీవ్మెంట్ గా భావిస్తాను. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌గారితో ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్ లో చేయటం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన చాలా కూల్ మరియు డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చకుంటూనే ఉన్నాను. పవన్ గారు ఒరిజినల్ మ్యాన్, ఒరిజినల్ థింకర్. ఆ సినిమాను గురించిన ఎక్స్‌పీరియన్సెస్ ఆ సినిమా టైమ్‌లో తప్పకుండా పవన్‌గారి పక్కన కూర్చుని తప్పకుండా మాట్లాడతాను. పవన్ గారు వెరీ వెరీ ఎంకరేజింగ్ పర్సన్.
తను చేసే ప్రతి సినిమా కుడా ఎంతో కొంత మార్పు తీసుకువస్తుంది. ఈ సినిమా కోసం అడవుల్లోకి వెళ్లొచ్చాక నేను పెళ్లి చేసుకున్నాను. అంటే అరణ్యవాసం తర్వాత వివాహం చేసుకున్నాను…(నవ్వుతూ).
ఈ సంవత్సరం నా నుండి మూడు సినిమాలు విడుదలవుతాయి. ‘అరణ్య’ తర్వాత ‘విరాటపర్వం’ విడుదలకు సిద్దంగా ఉంది. అది హ్యూమన్ డ్రామాతో ముడిపడిన ఒక బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ. ఇప్పుడు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.