Kantha : రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్‌ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ‘కాంత’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఈ పాన్ ఇండియా మూవీని రానా, దుల్కర్‌ కలిసి నిర్మిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది.
‘కాంత’ సినిమా చిత్రసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రానా హీరోగా, దుల్కర్‌ సహాయ దర్శకుడిగా నటిస్తున్నారు. ఒక హీరో, సహాయ దర్శకుడి మధ్య వచ్చే ఈగో క్లాష్‌ ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. సముద్రఖని ఈ సినిమాలో దర్శకుడి పాత్ర పోషిస్తున్నారు.

‘కాంత’ సినిమా ఈగో క్లాష్‌ నేపథ్యంలో వస్తున్న సినిమా. ఇంతకు ముందు ‘డ్రైవింగ్ లైసెన్స్‌’, ‘అయ్యప్పనుం కోషియుం’ వంటి సినిమాలు ఈ తరహా కథలతోనే విడుదలై పెద్ద హిట్లు అయ్యాయి. ‘కాంత’ కూడా అదే కోవలో విజయం సాధిస్తుందని అంచనా. ‘మిస్టర్ బచ్చన్‌’ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న భాగ్యశ్రీ బోస్రే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘మిస్టర్ బచ్చన్‌’ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ భాగ్యశ్రీకి మాత్రం ఆ సినిమా మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది. ‘కాంత’ సినిమా భాగ్యశ్రీ కెరీర్‌కు మరో మైలురాయిగా నిలుస్తుందో లేదో చూడాలి.

Leave a comment

error: Content is protected !!